Begin typing your search above and press return to search.

బాధ్యత గల తండ్రిగా సూపర్ స్టార్..!

By:  Tupaki Desk   |   14 April 2020 4:44 PM GMT
బాధ్యత గల తండ్రిగా సూపర్ స్టార్..!
X
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సెలెబ్రెటీలందరూ ఎవరిళ్ళకు వారే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయారు. తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. సినిమాల షూటింగ్స్ తో క్యాలెండర్ మొత్తం ఫుల్ బిజీగా ఉండే సినీ స్టార్స్ అంతా ఇలా మూడు వారాల పాటు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే టైం స్పెండ్ చేయడంతో వారి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే కరోనా నేపథ్యంలో వచ్చిన సెలవులను సుబ్బరంగా వాడుకుంటున్నాడు.

అందుకే ఈ కరోనా తీసుకొచ్చిన హాలీడేస్‌ను పూర్తిగా పిల్లలకే ఇచ్చేసాడు మహేష్. ప్రస్తుతం పిల్లలు సితార - గౌతమ్‌ లతో మహేష్ బాబు ఆడుకుంటున్నాడట.అలాగే కొత్త సినిమాలు - వెబ్ సిరీస్‌ లు ఏవీ వదలకుండా చూస్తున్నాడట. అన్నింటికంటే ముఖ్యంగా సితార - గౌతమ్ లు తండ్రిని ఒక్క క్షణం కూడా వదలడంలేరట. ఇప్పుడు కూడా క్వారంటైన్ నైట్స్ అంటూ తన కొడుకుతో సోఫాలో కూర్చున్న ఒక ఫోటో పోస్ట్ చేసాడు సూపర్ స్టార్. కొడుకుతో టైమ్ కేటాయించడానికి మహేష్ బాబుకు సరిపోతుందని ఈ ఫోటోతో అర్థం అవుతుంది. పెరుగుతున్న గౌతమ్ కి మహేష్ తగిన సూచనలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మహేష్ లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. బాధ్యత గల తండ్రిగా మహేష్ గౌతమ్ పట్ల వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ ప్రస్తుతం తన కెరీర్లో 27వ సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.