Begin typing your search above and press return to search.
మహేష్ తప్పించుకున్నాడా?
By: Tupaki Desk | 13 Jan 2019 4:52 PM GMTబోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'వినయ విధేయ రామ' ఊరమాస్ సినిమా అని టీజర్.. ట్రైలర్లతోనే అందరికీ క్లారిటీ వచ్చేసిందిగానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం కాస్త గట్టి షాకే తగిలింది. సినిమాలోని కొన్ని సీన్లకు ప్రేక్షకుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. చరణ్ ఇప్పటి వరకూ ఎన్నో మాస్ సినిమాలు చేశాడు గానీ ఇంతవరకూ ఈ రేంజ్ సినిమా మాత్రం చేయలేదు.
బోయపాటి కూడా ఎన్ని సినిమాలు చేసినా ఈ రేంజ్ మాస్ ఫ్రీక్వెన్సీ ఉండే సినిమా మాత్రం మొదటి సారే. ఇదిలా ఉంటే ఫిలిం నగర్లో ఈ సినిమాగురించి మరోరకమైన చర్చ జరుగుతోంది. అదేంటంటే 'వినయ విధేయ రామ' కథను బోయపాటి శ్రీను మొదట మహేష్ బాబుకు వినిపించాడట. కథ మహేష్ కు నచ్చి ఉంటే 'బ్రహ్మోత్సవం' కంటే ముందుగానే సెట్స్ మీదకు వెళ్ళేదట. కానీ మహేష్ కు కథ నచ్చకపోవడం తో రిజెక్ట్ చేశాడట. అందుకే ఆ కథకు బోయపాటి కొన్ని మార్పుచేర్పులు చేసి చరణ్ కు వినిపించి మెప్పించాడట. అలా 'వినయ విధేయ రామ' పట్టాలెక్కింది.
ఏదేమైనా మహేష్ ఈ సినిమా మిస్ అయినందుకు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'F2'.. 'పెట్టా' సినిమాలకు మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంచి రివ్యూలే ఇచ్చాడుగానీ 'వినయ విధేయ రామ' ఊసే ఎత్తలేదు.