Begin typing your search above and press return to search.
అదే బెస్ట్ కాంప్లిమెంట్ -మహేష్
By: Tupaki Desk | 16 Aug 2015 6:00 AM GMTవరుసగా రెండు వైఫల్యాలు.. డు ఆర్ డై సిట్యుయేషన్. ఏమవుతుందో అని నెర్వస్ ఫీలయ్యా. అయితే అది కంటెంట్ విషయంలో కాదు, ఫ్లాప్ లు వచ్చాయి కదా! అనే. కానీ నా టెన్షన్ మొదటి రోజే పోయింది. వేకువఝాము 4 గంటలకే భారం దిగిపోయింది. ఫోన్ కాల్స్ అన్నీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నే చెప్పాయి. 7, ఆగష్టు 2015.. మర్చిపోలేని ప్రత్యేకమైన రోజు. శ్రీమంతుడు రిలీజ్ రోజు. అంటూ ఎగ్జయిట్ అయ్యాడు మహేష్. శ్రీమంతుడు రిలీజ్ కి ముందు నెర్వస్ ఫీలయ్యారా? అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు.
హర్ష క్యారెక్టర్ మీ నిజజీవిత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిందా? అన్న ప్రశ్నకు.. అవును.. హర్ష క్యారెక్టర్ నా రియల్ లైఫ్ కి కనెక్టయి ఉంది. నేను ఉండే తీరు అలానే ఉంటుంది. డ్రెస్సింగ్ స్టయిల్, మాట తీరు అంతా సేమ్. అలాంటి క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన కొరటాలకు థాంక్స్. బాగా ఎగ్జయిట్ చేసిన సీన్ ఏది? అన్న ప్రశ్నకు.. ఈ సినిమాలో ప్రీ క్లయిమాక్స్ సీన్. ఆ షాట్ తీసే ముందు కొరటాలను పిలిచి ఓ మూడు రోజులు వాయిదా వేయమని అడిగాను. ఇంతవరకూ నా కెరీర్ లోనే ఇలా ఎవరినీ అడగలేదు. ఆ క్యారెక్టర్ లో లీనమవ్వడానికే అలా అడిగాను. ఆన్ సెట్స్ జగపతిబాబు రియల్ గానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సన్నివేశం షూట్ చేసేప్పుడు యూనిట్ అంతా ఉద్వేగానికి లోనయ్యారు. మన టాలీవుడ్ లోనే ఇంతవరకూ ఏ క్లయిమాక్స్ లో లేనట్టు ప్యామిలీ మెంబర్స్ అంతా సపరేట్ అయ్యే యూనిక్ కాన్సెప్టు శ్రీమంతుడులో ఉంది... అని చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్.
ఇకపోతే సినిమాకు వచ్చిన బెస్టు కాంప్లిమెంటు ఏది అంటే... "శ్రీమంతుడులో హర్ష పాత్రనే చూశాం. మహేష్ కనిపించలేదు అన్నదే బెస్ట్ కాంప్లిమెంట్" అని సెలవిచ్చాడు. శ్రీమంతుడు తర్వాత నా నుంచి జనాలు మంచి సినిమాల్నే ఆశిస్తున్నారు. బ్రహ్మూెత్సవం అలాంటిదే. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఇది. అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా. బ్రహ్మూెత్సవం తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది. .. అంటూ చాలా సంగతులే చెప్పాడు ప్రిన్స్.