Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: సూపర్ స్టార్ ఫ్యామిలీ స్టన్నింగ్
By: Tupaki Desk | 9 Oct 2019 5:12 AM GMTసూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ వెకేషన్ గురించి తెలిసిందే. దసరా సెలవుల్ని ఈసారి కూడా ఏమాత్రం మిస్ చేయలేదు మహేష్. కుటుంబ సమేతంగా భూతల స్వర్గం స్విట్జర్లాండ్ కి వెళ్లారు. అక్కడ అద్భుతమైన ఎగ్జోటిక్ లొకేషన్స్ లో ఫ్యామిలీతో జాలీ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు. ఈ ట్రిప్ లో యథావిధిగా నమ్రత శిరోద్కర్- గౌతమ్- సితార బృందం ఉన్నారు.
ఇంతకుముందు స్విస్ లో తన ఫేవరెట్ ప్లేస్ ఇదేనంటూ మహేష్ బృందం ఓ బ్యూటిఫుల్ ఫోటోని అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు. తాజాగా మరో స్టన్నింగ్ ఫోటోని రివీల్ చేశారు. ఈ ఫోటోలో మహేష్ ఫ్యామిలీ క్లాసిక్ లుక్ తో మైమరిపించింది. సూపర్ స్టార్ టాప్ క్లాస్ సూట్ లో స్టైలిష్ గా కనిపిస్తే నమ్రత ట్రెడిషనల్ లుక్ లో సింపుల్ గా కనిపించారు. మాస్టర్ గౌతమ్ సూటులో మెరిశాడు. సితార ఫ్రాకులో ఎంతో క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటో చూడగానే గౌతమ్ - సితార ఎంత వేగంగా ఎదిగేస్తున్నారో కదా! అనిపిస్తోంది. గౌతమ్ ఆల్మోస్ట్ డాడ్ మహేష్ అంత ఎత్తు.. పర్సనాలిటీతో ఎదిగేస్తున్నాడని ఈ ఫోటో చెబుతోంది.
ప్రస్తుతం ఈ ఫోటోని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రిప్ ముగించుకుని రాగానే తదుపరి `సరిలేరు నీకెవ్వరు` బ్యాలెన్స్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. జెట్ స్పీడ్ తో పూర్తవుతున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. మహేష్ ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కర్నూల్- హైదరాబాద్- కశ్మీర్ లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు.