Begin typing your search above and press return to search.

NYE 2020: ముంబైకి జంప్ అని ముందే చెప్పాంగా!

By:  Tupaki Desk   |   29 Dec 2019 12:35 PM GMT
NYE 2020: ముంబైకి జంప్ అని ముందే చెప్పాంగా!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీలో అప్పుడే కొత్త సంవ‌త్స‌రం సంబ‌రం క‌నిపిస్తోంది. ఇదిగో ఇలా హైద‌రాబాద్ లో స‌రిలేరు డ‌బ్బింగ్ పూర్త‌యిందో లేదో అలా ముంబైలో వాలిపోయారంతే. చటుక్కున న‌మ్ర‌త‌తో క‌లిసి గౌత‌మ్ సితార బృందం ముంబైకి ప్ర‌యాణం అయిపోయారు. వాళ్ల‌తో పాటే గ‌ళ్ల చొక్కాలో టాలీవుడ్ రాకుమారుడు మ‌హేష్‌ ముంబైలో వాలిపోయాడు. మ‌హేష్‌- న‌మ్ర‌త అండ్ ఫ్యామిలీ ముంబై విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌కు వెళుతూ మీడియా కంటికి చిక్కారు.

మ‌హేష్ స్టైలిష్ గా క‌ళ్ల‌కు రెబాన్ పెట్టుకుని బులుగు జిలుగు గ‌ళ్ల చొక్కాలో దిగిపోయాడు. ష‌ర్ట్ కి బ్లాక్ చెక్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించాయి. ఇక త‌న‌తో పాటే న‌మ్ర‌త వైట్ అండ్ వైట్ లో క్యాజువ‌ల్ గానే క‌నిపించారు. గౌత‌మ్ సితార‌లో తాత‌య్య గారి ఇంటికి వెళుతున్న ఉత్సాహం అంతే ఇదిగా క‌నిపిస్తోంది.

31 మిడ్ నైట్ ట్రీట్ పూర్త‌వ్వ‌గానే మ‌హేష్ తిరిగి హైద‌రాబాద్ కి వ‌స్తారు. ఇక్క‌డ స‌రిలేరు నీకెవ్వ‌రు ప్ర‌మోష‌న్స్ సంగ‌తులు చూడాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రి 5న ప్రీరిలీజ్ ఈవెంట్ పూర్త‌వ్వ‌గానే తిరిగి విదేశీ వెకేష‌న్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎలానూ సంక్రాంతి సెల‌వులు ఉంటాయి కాబ‌ట్టి వాటిని కిడ్స్ తో ఎంజాయ్ చేసేందుకు లండ‌నో.. ప్యారిసో లేక స్విట్జ‌ర్లాండ్ కో జంప్ అవ్వ‌డం ఖాయం అని భావిస్తున్నారు.