Begin typing your search above and press return to search.
థాయ్ ల్యాండ్ కి శ్రీమంతుడు ఫ్యామిలీ ట్రిప్
By: Tupaki Desk | 22 Aug 2015 4:54 PM GMTమహేష్ రిలీఫ్ గా ఉన్నాడిప్పుడు. శ్రీమంతుడు ఘనవిజయం ఊరటనిచ్చింది. కేవలం రెండు వారాల్లో 100కోట్లు పైగా వసూళ్లు సాధించడం అంటే టాలీవుడ్ హిస్టరీ లో ఘనమైన విజయమే. బాహుబలి తర్వాత శ్రీమంతుడుకే అది సాధ్యమైంది. అందుకే ఈ మూవ్ మెంట్ ని ఎంజాయ్ చేయడానికి, ఇంతకాలం ఫేస్ చేసిన స్ట్రెయిన్ నుంచి బైటపడడానికి ఓ ట్రిప్ ప్లాన్ చేశాడు మహేష్.
షూటింగ్ బడలిక తీర్చుకోవడానికి ఫ్యామిలీతో థాయ్ ల్యాండ్ వెళుతున్నాడు. ఈరోజు రాత్రికే నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి విదేశీ టూర్ వెళుతున్నాడు. వారంపాటు అక్కడే ఫుల్లుగా రిలాక్స్ అయి రిటన్ వస్తాడు. నిజానికి ఈ ట్రిప్ ఎప్పుడో వెళ్లాల్సినది. జూన్ లో వెళ్లాలనుకుంటే కుదరలేదు. శ్రీమంతుడు రిలీజ్ జూలై నుంచి ఆగష్టుకి పోస్ట్ పోన్ అవ్వడంతో ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సొచ్చింది. ఇప్పుడు శ్రీమంతుడు సక్సెస్ తో పూర్తిగా రిలీఫ్ దొరికింది.
మహేష్ మునుపెన్నడూ లేనంతగా కష్టపడ్డాడు. ఓ వైపు షూటింగ్, మరోవైపు ప్రమోషన్ కోసం ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకున్నాడు. నేరుగా ప్రొడక్షన్ లోకి దిగాడు కాబట్టి అసలు కష్టం ఏంటో తెలిసొచ్చింది. కాబట్టి ఇప్పుడు వెకేషన్ అవసరం. శారీరక, మానసిక బడలిక తీర్చుకునేందుకు హాలీడే ట్రిప్ మస్ట్. అందుకే ఈ ఫ్యామిలీ ట్రిప్.