Begin typing your search above and press return to search.
న్యూయార్క్ లో గూడచారి అయిన మహేష్ ఫ్యాన్
By: Tupaki Desk | 29 Oct 2018 9:54 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఆయన ఫ్యాన్స్ లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఉంటారు. కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికాలో ఉన్న తెలుగు వారు కూడా మహేష్ బాబును విపరీతంగా ఆరాధిస్తూ - అభిమానిస్తూ ఉంటారు. అందుకే మహేష్ బాబు ఏ సినిమా విడుదలైనా కూడా అమెరికాలో భారీగా వసూళ్లు నమోదు అవుతూనే ఉంటాయి. తాజాగా ఒక అభిమాని మహేష్ బాబును న్యూయార్క్ లో చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మహర్షి’ చిత్రం షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన మహేష్ బాబును అమెరికాలోనే ఉండే చైతన్య అనే అభిమాని కలవాలని నిర్ణయిచుకున్నాడట. అలా నిర్ణయించుకున్న చైతన్య వారం రోజుల పాటు పడ్డ కష్టంను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మహేష్ న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యాడనే విషయం తెలియగానే వెంటనే నేను న్యూ యార్క్ వెళ్లాను. అంత పెద్ద నగరంలో మహేష్ ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలో అనుకున్నారు. ఆ సమయంలోనే నమ్రత గారు సితార - ఆలియాభట్ లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆ హోటల్ వద్దకు వెళ్లాను. రోజంతా ఆ హోటల్ ముందు నిల్చున్నాను. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ నన్ను అక్కడ నుండి పంపించేందుకు ప్రయత్నించగా - మా సూపర్ స్టార్ ఇక్కడ ఉన్నారు - ఆయన్ను కలవాలని వెయిట్ చేస్తున్నానంటూ వారికి సర్ది చెప్పాను.
నమ్రత గారు షేర్ చేసిన ఫొటోల్లో ఉన్న అడ్రస్ ల ఆధారంగా మహేష్ ను కలిసేందుకు ప్రతి ఒక్క ప్రదేశంకు వెళ్లాను. కాని ఏ ఒక్క చోట కూడా ఆయన్ను కలిసే అవకాశం దక్కలేదు. చివరకు మహేష్ ను కలవలేనేమో అనుకున్నాను. మహేష్ టీంకు వరుసగా మెసేజ్ లు పెట్టాను - తాను చేస్తున్న ప్రయత్నాలు వారికి తెలిసేలా చెప్పే ప్రయత్నం చేశాను. దాంతో వారు నాకు మహేష్ ను కలిసే అవకాశం ఇచ్చారని చైతన్య పేర్కొన్నాడు. 21వ తేదీన న్యూయార్క్ లో ల్యాండ్ అయిన నేను 25వ తారీకున మహేష్ టీంను కలిశాను - వారి ద్వారా అక్టోబర్ 27వ తారీకున మహేష్ ను కలిశానంటూ తన సంతోషంను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
మహేష్ ను కలవడం చాలా సంతోషంగా ఉందని - ఇన్నాళ్ల తర్వాత హాయిగా పడుకున్నానని చెప్పుకొచ్చాడు. నా జీవితంలో పెద్ద అచీవ్ మెంట్ ఇది అంటూ అతడు పేర్కొన్నాడు. తను మహేష్ బాబును కలిసిన విధానం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.