Begin typing your search above and press return to search.

లాజిక్ మరచిపోతున్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   27 April 2018 11:41 AM GMT
లాజిక్ మరచిపోతున్న ఫ్యాన్స్
X
ఇటీవలే భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు స్వయంగా మేము మేము ఒకటే మీరు కూడా బాగుండండి అని చెప్పి పట్టుమని రెండు వారాలు పూర్తి కాలేదు మా గొడవ మాదే అంటూ హీరోల ఫ్యాన్స్ మళ్ళి తమ పాత రూట్లోకి వచ్చేసారు. నిన్న మహేష్ బాబు కొలతల కోసం ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు రావడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం నిన్న చూసాం. ఇప్పుడు ఇదే టాపిక్ మీద అభిమానులు ఒకరికంటే ఒకరు గొప్ప అని చెప్పుకోవడం మొదలు పెట్టడంతో ఒకరకమైన ట్రాలింగ్ స్టార్ట్ అయిపోయింది. సౌత్ లో ఇప్పటి దాకా బాహుబలి తర్వాత ఒక్క ప్రభాస్ కు మాత్రమే ఈ ఘనత దక్కింది. ఆ తర్వాత మహేశే. ఇప్పుడు దీన్నే ప్రభాస్ ఫాన్స్ తమ హీరో ఈ ఘనత సాధించి ఏడాది దాటిందని మహేష్ కు ఇప్పుడు వచ్చిందని కామెంట్ చేస్తే దానికి ప్రిన్స్ ఫాన్స్ కూడా ధీటుగా బదులు ఇస్తున్నారు.

అప్పుడు ప్రభాస్ గా కన్నా బాహుబలి పాత్రకే వాళ్ళు గుర్తింపు ఇచ్చారని అంతే తప్ప వ్యక్తిగతంగా కాదని ఆ లెక్కన చూసుకుంటే జస్ట్ ఒక కమర్షియల్ హీరోగా ఆ ఫీట్ సాధించిన మొదటి హీరో మావాడే అని వీళ్ళు బదులు ఇస్తున్నారు. మొత్తానికి అలా అలా మాటల యుద్ధం సాగిపోతోంది. ఒకరిది ముందు ఒకరిది తర్వాత పెట్టారు అని వాదులాడుకోవడం అర్థం లేని పని. సౌత్ ఇండియా గర్వించే విషయం కాబట్టి అది అందరు ఆనందంగా ఫీల్ అవ్వాలి కాని మా హీరోకు ఫస్ట్ అని లాస్ట్ అని చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ లాంటి నిన్నటి తరం హీరోలకే కాదు మహేష్ నాన్న గారు కృష్ణ, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారితో సహా ఎవరికీ అక్కడ మైనపు విగ్రహాలు లేవు. ఆ లాజిక్ మిస్ అయితే ఎలాగయ్యా ఫాన్స్.