Begin typing your search above and press return to search.
#RRR.. మహేష్ ఫాన్స్ అప్సెటయ్యారా?
By: Tupaki Desk | 27 March 2018 1:17 PM GMT#RRR.. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈపేరే కనిపిస్తోంది. ఇంకా సినిమా షూటింగ్ మొదలు కూడా కాలేదు కానీ ఈ సినిమాకు ఉన్నంత క్రేజ్ మరే సినిమాకు లేదు. ఎందుకంటే మొట్టమొదటి సారి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే తెరపైన కనిపిస్తారు. సినిమా దర్శకత్వం కూడా రాజమౌళి వహించబోతున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి సినిమాకు హైప్ రావడానికి. కానీ ఈ సినిమాపైన మహేష్ ఫాన్స్ తీవ్ర అసంతృప్తి వక్తం చేస్తున్నారట.
టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకడు. అతనికి ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఏ డైరెక్టర్ను అయినా వాళ్లు అడిగే మొదటి ప్రశ్న మహేష్ తో సినిమా ఎప్పుడు తీస్తారు అని. ఆ ప్రశ్న బాహుబలి ప్రమోషన్ల సమయంలో రాజమౌళి కూడా ఎదుర్కొన్నాడు. "ఇప్పటికే కె.ఎల్.నారాయణ తో ఒక ప్రాజెక్ట్ సైన్ చేశాము. కానీ మహేష్ కు నాకు డేట్స్ కుదరడంలేదు. అవి కుదరగానే మహేష్ తో సినిమా తీస్తా" అని చెప్పాడు జక్కన్న. మరి ఈ సినిమా ఒక కొలిక్కి రాలేదు కానీ రాజమౌళి #RRR ను అనౌన్స్ చేయడం మహేష్ ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
రాజమౌళి మహేష్ తో సినిమా తీస్తాడు అని ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటే ఆ సినిమా గురించి ఎవరూ పెదవి విప్పకపోయేసరికి విసిగిపోయిన ఫాన్స్ ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. నిజానికి మహేష్ ఏం కాళీగా లేడు కదా. భరత్ అనే నేను తో బిజీగా ఉన్న మహేష్ చేతిలో ఇప్పటికే వంశీ పైడిపల్లి తో చేయాల్సిన సినిమా ఉంది. ఈ సంవత్సరం అంతా షూటింగ్స్ తో తీరిక లేకుండా ఉన్నాడు. మరి ఈ సమయంలో రాజమౌళి ఖాళీగా ఉండటం దేనికి.. మహేష్ ఫాన్స్ ఈ కోణంలో కూడా కొంచెం ఆలోచించాల్సిందే.