Begin typing your search above and press return to search.

తట్టుకోలేకపోతున్న మహేష్‌ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   29 May 2017 11:25 AM IST
తట్టుకోలేకపోతున్న మహేష్‌ ఫ్యాన్స్
X
బాలీవుడ్ లో అసలు అవార్డు షోలను హోస్ట్ చేసే తీరును పూర్తిగా మార్చేశారు షారూఖ్‌ ఖాన్.. రణబీర్ కపూర్ వంటి నటులు. వాళ్లు ఎన్నోసార్లు స్టేజీలపై ఖాన్లు గొప్ప కపూర్లు గొప్ప అంటూ వాగ్వివాదం స్టార్ట్ చేసి.. ఒకరిపరువు ఒకరు తీసుకుని.. అందరినీ నవ్వించారు. పెద్ద పెద్ద స్టార్లు చేసిన ఫ్లాపు సినిమాలపై జోకులు పేల్చేసి అలరించారు. అయితే ఇదే ట్రెండ్ మన తెలుగులో ఫాలో అవుదాం అంటే మాత్రం.. మనోభావాలు దెబ్బతింటున్నాయి.

మొన్నామధ్యన జరిగిన ఐఫా వేడుకలను నిన్ని జెమినీ టివిలో ప్రసారం చేశారు. ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి మరియు నాని.. బాలీవుడ్ తరహాలో వారి మీద వారే సెటైర్లు వేసుకుంటూ.. నానా హంగామా చేశారు. నిజంగా కూడా అదిరిపోయింది. అయితే ఈ టైములో పెళ్ళి గురించి రానా ప్రస్తావిస్తూ.. ''పెల్ళికిముందు ఎవరైనా శ్రీమంతుడే. పెళ్లి తరువాతే బ్రహ్మోత్సవం'' అంటూ కామెంట్ చేశాడు. ఆ లైన్ అందరికీ బాగానే నచ్చింది కాని.. మహేష్‌ ఫ్యాన్స్ కు మాత్రం సదరు సెటైర్ రుచించట్లేదు. మా హీరో ఫ్లాపును నువ్వు ఎత్తిచూపుతావా అంటూ సోషల్ మీడియాలో వారు రచ్చ చేస్తున్నారు.

నిజానికి మన హీరోలు అవార్డు ఫంక్షన్లకే రారు అనే నానుడి నుండి.. ఈ మధ్యనే కొత్తగా డిఫరెంట్ గా బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ ప్రయత్నిస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం ఇలా హర్టయ్యాం అనడం అంత కరక్ట్ కాదేమో. సెటైర్ అనేది తీసుకోకపోతే ఇక 'సెటైర్' అనే విషయానికి పెద్దగా అర్ధం ఉండదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/