Begin typing your search above and press return to search.

సెలబ్స్‌ లో మహేష్‌ వీరాభిమానులు వీళ్లే

By:  Tupaki Desk   |   11 Aug 2015 4:06 PM GMT
సెలబ్స్‌ లో మహేష్‌ వీరాభిమానులు వీళ్లే
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా అతడిని అభిమానించేవారున్నారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దర్శకులు, హీరోలు కూడా అతడికి పెద్ద ఫ్యాన్స్‌.

ఈ జాబితాలో తమిళ స్టార్‌ డైరెక్టర్లు ఏ.ఆర్‌.మురుగదాస్‌, శంకర్‌ ఉన్నారు. నేను మహేష్‌ కి పెద్ద ఫ్యాన్‌ ని. అతడితో ఓ సినిమా చేస్తానని మురుగదాస్‌ ఇదివరకే ప్రకటించారు. మహేష్‌ బాబు స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అద్భుతం అంటూ శంకర్‌ అంతటి స్టార్‌ డైరెక్టర్‌ కీర్తించాడు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ల లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి అతడికి వీరాభిమాని. మహేష్‌ టెర్రిఫిక్‌ యాక్టర్‌. రజనీకాంత్‌ తో సమానమైన మార్కెట్‌ ఉన్న హీరో అంటూ జక్కన్న పొగిడేశాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అయితే .. మహేష్‌ లోపాలే లేని బ్రిలియంట్‌ యాక్టర్‌ అంటూ ప్రశంసించారు. మహేష్‌ బాబు పక్కా పెర్ఫక్షనిస్ట్‌ అని కితాబిచ్చాడు సుకుమార్‌.

మహేష్‌ నా ఫేవరెట్‌ హీరో. మూవీ ఫెయిలైనా అతడు మాత్రం ఫెయిల్‌ కాలేదని త్రివిక్రమ్‌ తన ఫీలింగ్‌ చెప్పాడు. మహేష్‌ దేశంలోనే బెస్ట్‌ యాక్టర్‌ అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ కీర్తించాడు. తెలుగులో మహేష్‌ బాబు నా ఫేవరెట్‌ యాక్టర్‌ అంటూ గౌతమ్‌ మీనన్‌ పొగిడేశాడు. మహేష్‌ మోస్ట్‌ అమేజింగ్‌ ఆర్టిస్టు. ఏ పాత్రలోకి అయినా ఒదిగిపోగలడని క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ అన్నారు. మహేష్‌ బాబు ఈజ్‌ యాన్‌ ఎడిక్షన్‌ అంటూ ఒక్క లైన్‌ లోనే మెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్‌. మహేష్‌ అన్ని వేరియేషన్స్‌ ఉన్న హీరో. ఏ పాత్రలో అయినా చేయగలడని బోయపాటి తన అభిమానాన్ని ప్రదర్శించాడు.

ఇక బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ మాట్లాడుతూ .. మహేష్‌ గ్రేట్‌ పర్సన్‌. అతడంటే నాకు అపారమైన గౌరవం అని అన్నాడు. ఇలా వెతికితే సెలబ్రిటీల్లోనే డజన్ల కొద్దీ ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రిన్స్‌ అసాధారణ ఫాలోయింగ్‌ కి ఇదే నిదర్శనం.