Begin typing your search above and press return to search.
మహేష్ ఫ్యాన్స్.. ఏంటీ న్యూసెన్స్?
By: Tupaki Desk | 8 May 2016 4:35 AM GMTబ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ ఫంక్షన్ అదిరిపోయే రేంజ్ లో జరిగింది. సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్.. కలర్ ఫుల్ సెట్.. అందాల హీరోయిన్లు.. అందరికీ మించి మహేష్ విత్ ఫ్యామిలీ.. మొత్తం ఈవెంట్ అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రకారం జరిగి ఆకట్టుకుంది. అయితే.. ఒకే ఒక్కటి మాత్రం కొంచెం డిస్టర్బ్ అనిపించింది. ఆ డిస్టర్బెన్స్ కి కారణం ఎవరో కాదు.. సూపర్ స్టార్ ఫ్యాన్సే. మహేష్ ఫ్యాన్స్ తమ హీరోనే డిస్టర్బ్ చేయడం ఏంటని అనిపించడం సహజమే కానీ.. ఇదే నిజం.
ఫంక్షన్ అంతా సూపర్ స్టార్ జిందాబాద్ - సూపర్ స్టార్ మహేష్ అంటూ ఛాంటింగ్ చేస్తూనే ఫ్యాన్స్. ఇందులో తప్పేం లేదు కానీ.. మహేష్ మాట్లాడుతున్నపుడు కూడా వాళ్లది ఇదే వరుస. ఆపండమ్మా అంటూ రెండుసార్లు స్వయంగా తనే వారించాడు మహేష్. అయినా అభిమానుల తీరు మాత్రం మారలేదు. ఇలాంటి అరుపులు సహజంగా మెగా ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు. పవర్ స్టార్ అని అరుస్తూ ఇబ్బంది పెట్టేందుకు ట్రై చేయడం చూశాం. పవన్ ఫ్యాన్స్ తో పాటు అప్పుడప్పుడూ బాలయ్య అభిమానులు కూడా ఇలా చేయడం జరిగిందే. షేర్ ఆడియో ఫంక్షన్ లో జై బాలయ్య అని అరుస్తుంటే.. మా మధ్య విబేధాలు తేకండి - మేమంతా ఒకటే అని కళ్యాణ్ రామ్ సర్దిచెప్పాడు.
అటు నందమూరి హీరోల్లోనూ - ఇటు మెగా-పవర్ స్టార్ ల మధ్య రాజకీయంగా కొన్ని తేడాలున్నాయ్ కాబట్టి.. అక్కడేదో జరిగిందంటే అర్ధం ఉంది. కానీ ఒకవైపు మహేష్ బాబు మాట్లాడుతుంటే.. సూపర్ స్టార్ అనే అరుపులతో, తననే ఇబ్బంది పెట్టడం ఏంటో.. ఆ ఫ్యాన్స్ కే తెలియాలి. అభిమానంలో అరుపులు సహజమే కానీ.. అర్ధం పర్ధం లేకుండా అరవడం ఎందుకు అనేది అర్ధమవాలి కదా అభిమానులూ! కాస్త అలోచించండి.