Begin typing your search above and press return to search.

మ‌హేష్ 25 'శ్రీ‌మంతుడు' రేంజులో?

By:  Tupaki Desk   |   7 Aug 2018 7:40 AM GMT
మ‌హేష్ 25 శ్రీ‌మంతుడు రేంజులో?
X
ఈరోజుల్లో 100 రోజులు ఆడే సినిమాలొస్తున్నాయా? మ‌హా అయితే మూడు రోజులు, ఇంకా బావుంటే వారం రోజులే! మొద‌టి వారంలోగానే బాక్సాఫీస్ వ‌ద్ద‌ లాగాల్సిన క‌లెక్ష‌న్స్ లాగేయాలి. విడుద‌లైన రోజే పైర‌సీ ఆన్‌ లైన్‌ లో అందుబాటులోకి వ‌చ్చేస్తుంటే అందుకు విరుగుడుగా క‌నిపెట్టిన మందు ఇది. లెక్క‌కు మిక్కిలిగా మెజారిటీ స్క్రీన్ల‌లో రిలీజ్ చేసి తొలి మూడు రోజులు ఆడించి డ‌బ్బులు రాబ‌ట్టుకునే స్కీమ్‌ ని మ‌న ఫిలింమేక‌ర్స్‌ ఆలోచించారు. భారీ పెట్టుబ‌డుల్ని వెన‌క్కి ర‌ప్పించాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు స్కీమ్ మార్చాల్సిన స‌న్నివేశం ఉందిప్పుడు. తొలి మూడు రోజులు బ్లాక్‌ లో టిక్కెట్లు అమ్మించే స్కీమ్ కూడా ఇందులో ఓ భాగం.

వారం - రెండు వారాల్లోనే థియేట‌ర్ల నుంచి సినిమాల్ని తీసేస్తున్న ఈ రోజుల్లో ఏకంగా 100రోజులు - 150రోజులు - 175 రోజులు అంటూ పోస్ట‌ర్లు వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. 7ఆగ‌స్టు 2015న రిలీజైన‌ మ‌హేష్ - కొర‌టాల కాంబో `శ్రీ‌మంతుడు` ఎమ్మిగ‌నూరు (క‌ర్నూలు) ల‌క్ష్మ‌ణ్ థియేట‌ర్‌ లో 175రోజులు ఆడింది. అప్ప‌ట్లోనే 175రోజుల పోస్ట‌ర్‌ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్ట‌ర్‌ ని ఉన్న‌ట్టుండి ఈరోజు `మ‌హేష్ 25` రిలీజ్ ముంగిట అధికారిక పీఆర్‌ వో మ‌రోసారి మీడియాకి రివీల్ చేశారంటే.. మ‌హేష్ నుంచి రాబోవు సినిమా అన్ని రోజులు ఆడుతుంద‌నే అర్థంలోనే ఇలా వేశారా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌ లోని త‌దుప‌రి చిత్రానికి రిషి అనే టైటిల్‌ ని ప‌రిశీలిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఒక్కో అక్ష‌రం రివీల్ చేస్తూ టైటిల్‌ పై సస్పెన్స్‌ని లీడ్ చేస్తున్నారు. ఈ బుధ‌వారం మ‌హేష్ బ‌ర్త్‌ డే సంద‌ర్భంగా టైటిల్‌ ని ప్ర‌క‌టించ‌నున్నారు. శ్రీ‌మంతుడు త‌ర‌హాలోనే మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` 175రోజుల‌ పోస్ట‌ర్ రానుందా? ఇదివ‌ర‌కూ 100రోజుల పోస్ట‌ర్ వేశారు క‌దా!.. అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మొత్తానికి మ‌హేష్‌ 25 రిలీజ్ ముందు ర‌క‌ర‌కాల స్పెక్యులేష‌న్స్‌ తో అభిమానుల్లో సినిమాపై అంచ‌నా పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌చార హోరు బాగానే జోరందుకుంద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.