Begin typing your search above and press return to search.
పూరిని ప్రేమతో నిలదీస్తున్న మహేష్ ఫ్యాన్స్
By: Tupaki Desk | 20 July 2019 7:38 AM GMTఇస్మార్ట్ శంకర్ తో చాలా కాలం తర్వాత మరో కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకునేలా కనపడుతున్న పూరి జగన్నాధ్ ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో సినిమా గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా పెద్ద టాపిక్ అయ్యాయి. తనకు క్యారెక్టర్ ఉందని జనగణమన టైంలో తనను వద్దన్న మహేష్ తో ఇప్పుడు ఎలా చేస్తాను అనే రీతిలో బదులివ్వడం అందులోనూ మహేష్ కన్నా తాను అతని అభిమానులనే ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పడం ఇంకాస్త రచ్చ చేసేందుకు అవకాశం ఇచ్చింది.
ఇది మా పూరి అంటూ దర్శకుడి అభిమానులు ఒకవైపు మేము చెప్పే లాజిక్ ఆలోచించండి అంటూ మహేష్ ఫ్యాన్స్ మరోవైపు రెండు వర్గాలుగా విడిపోయారు. పూరి అన్నది తాను సక్సెస్ లో లేను కాబట్టి మహేష్ ప్రాజెక్ట్ కు నో చెప్పాడు అని. ఇతని సపోర్టర్స్ అంటున్నది కూడా ఇదే. కానీ నేను నా రాక్షసి డిజాస్టర్ అయ్యాకే కదా బిజినెస్ మెన్ ఛాన్స్ ఇచ్చింది మరి దాని సంగతేంటి అని లాజిక్ తీస్తున్నారు ప్రిన్స్ అభిమానులు. ఇందులో పాయింట్ ఉంది.
జనగణమన చెప్పే టైంకి పూరి ఫామ్ లో లేడు. ఇడియట్-అమ్మా నాన్న తమిళ అమ్మాయి-పోకిరి టైంలో హీరోలే వెంటబడి డేట్స్ అడిగే రేంజ్ లో ఉన్న పూరి ఆ తర్వాత పట్టుతప్పి దేవుడు చేసిన మనుషులు లాంటి స్క్రాప్ సినిమాలు తీసినప్పుడు ఏ హీరో అయినా ఎలా నమ్ముతాడు. అదే కదా మహేష్ చేసింది అనేది ఇటువైపు వినిపిస్తున్న వెర్షన్. పైగా రోగ్-లోఫర్-మెహబూబా లాంటి డిజాస్టర్స్ ఉన్న టైంలో ఏ హీరో అయినా ఆలోచిస్తాడా లేదా అని అడుగుతున్నారు. అంతేకాని మహేష్ తో మళ్ళీ సినిమా చేస్తే నా క్యారెక్టర్ ఏమవుతుంది అన్న పూరి కామెంట్ ని ప్రేమతోనే ఒప్పుకోవడం లేదు పూరిని అభిమానించే మహేష్ ఫ్యాన్స్. మరి దీనికి బదులు ఏమొస్తుందో చూడాలి