Begin typing your search above and press return to search.
మహేష్ అలా అనగానే కన్నీళ్లొచ్చాయి: స్టార్ హీరో
By: Tupaki Desk | 3 Dec 2022 5:30 PM GMTయంగ్ హీరో అడవి శేషు నటించిన `హిట్-2` హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మర్డర్ మిస్టరీ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. మరోసారి ఇండస్ర్టీలో శేషు పేరు మారుమ్రోగిపోతుంది. పాన్ ఇండియా సక్సెస్ `మేజర్` తర్వాత ఆవెంటనే మరో భారీ విజయం శేషుని ఆనందంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం యంగ్ హీరో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు.
కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడినా? ఇన్ని సంవత్సరాలకు తాను అనుకున్నది సాధించగలిగాడు. మూసలో వెళ్తోన్న టాలీవుడ్ కి డిఫరెంట్ కంటెంట్ అందించడం శేష్ తోనే మొదలైందని చెప్పొచ్చు. ఆ నమ్మకంతోనే మహేష్ అతనితో మేజర్ సినిమాని పాన్ ఇండియాలో చేసారు. ఆ సక్సెస్ తో మహేష్ కి నమ్మకం మరింత బటపడింది.
అతనితో మరిన్ని అద్భుతాలుచేయోచ్చని ధీమా కల్గింది. తాజాగా శేష్ ట్విటర్లో అభిమానులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో మహేష్ తో మరో థ్రిల్లింగ్ మూవీ చేయాలంటూ కోరాడు. దీనికి శేష్ ఇలా బధులిచ్చారు. ఈ రోజు ఉదయమే ఆయనతో చాలా సేపు మాట్లాడా. నా విషయంలో ఆయన గర్వంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది.
ఆయన నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నందకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన అలా అనడతంతో ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేసాయి. ఓ బ్రదర్ గా ఎప్పటికీ తోడు ఉంటానని ఆయనకి మాటిచ్చా. హిట్ -2 కోసం ఆశగా ఎదురుచూ స్తున్నా..ఎప్పుడు చూపిస్తావ్ అని అన్నారు. ఆయన అలా అనే సరికి ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాలేదు` అని అన్నారు.
మొత్తానికి శేషు టైమ్ టాలీవుడ్ లో ఊపందుకున్నట్లే కనిపిస్తుంది. పాన్ ఇండియ వైడ్ అతని క్రేజ్ పెరగడంతో ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదుగుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నటుడితో పాటు రైటింగ్ స్కిల్స్ ఉండటం అదనంగా రాణించడానికి అవకాశం ఉంది. శేష్ రొటీన్ కి భిన్నంగా ఉంటాడు. ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తాడు. కొత్త ప్రయోగాలకు వెనుకాడడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.