Begin typing your search above and press return to search.

మహేష్ బాబు ఫస్ట్ టైమ్.. రీస్కీ లుక్ ?

By:  Tupaki Desk   |   17 Jan 2023 8:30 AM GMT
మహేష్ బాబు ఫస్ట్ టైమ్.. రీస్కీ లుక్ ?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 18న ప్రారంభం కాబోతుంది. యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే అతను పోషించేది విలన్ పాత్రనా లేదంటే హీరో తండ్రి పాత్రనా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్ లో కొన్ని కథలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇప్పటి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలే కనిపిస్తాయి.

ఫ్యామిలీ కోసం ఏమైనా చేసే కొడుకుగా హీరో పాత్రని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓ విధంగా చెప్పాలంటే త్రివిక్రమ్ సినిమాలో హీరో అంటే హైపర్ యాక్టివ్ గా ఉంటూనే చాలా తెలివైన వాడు. అలాగే రాముడు మంచి బాలుడు తరహాలో కుటుంబమే ప్రాణంగా బ్రతికేవాడిగానే ఉంటాడు. హీరోయిన్ పాత్రలు అయితే అమాయకంగా, ఫన్నీగా ఉంటాయి. అలాగే హీరోకి ఒక అత్తో, పిన్నో, లేదంటే అమ్మో కచ్చితంగా ఉంటుంది.

తండ్రి కొడుకుల సెంటిమెంట్, తల్లి కొడుకుల సెంటిమెంట్, అత్తా అల్లుళ్ళ సెంటిమెంట్. అంటూ ఏదో ఒక ఎలివేషన్ ని తీసుకొని దాని చుట్టూ కథని బలమైన సంభాషణలతో అల్లుకొని స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడు. ఈ బలమైన ఎమోషన్స్ కారణంగా త్రివిక్రమ్ సినిమాలకి తెలుగు ఆడియన్స్ భాగా కనెక్ట్ అయిపోతారు.

అయితే ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ జోనర్ మార్చినట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా, అలా అని యాక్షన్ థ్రిల్లర్ లోకి వెళ్ళకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కథని సూపర్ స్టార్ సినిమా కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు పొడవాటి హెయిర్ స్టైల్ తో సన్నని గడ్డంతో డిఫరెంట్ గా రెట్రో హీరో తరహాలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు తన కెరియర్ లో మొదటి సారి ఇలాంటి లుక్ ని మహేష్ బాబు ట్రై చేస్తున్న నేపధ్యంలో ఇది ఎంత వరకు ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కి రీచ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.