Begin typing your search above and press return to search.

కొడుకును ఫోకస్‌ లో ఉంచుతున్న మహేష్‌

By:  Tupaki Desk   |   1 May 2019 5:50 AM GMT
కొడుకును ఫోకస్‌ లో ఉంచుతున్న మహేష్‌
X
సూపర్‌ స్టార్‌ వారసుడు అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అందరికి సాధ్యం అయ్యే పని కాదు. అతి కొద్ది మందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. మహేష్‌ బాబు తన తండ్రి వారసత్వంను పునికి పుచ్చుకుని సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఇక మహేష్‌ బాబు వారసుడిగా గౌతమ్‌ కృష్ణ కూడా హీరో అవ్వడం ఖాయం అంటూ మొదటి నుండి కూడా మహేష్‌ బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు. గౌతమ్‌ కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, ఫొటోను కూడా అభిమానులు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తూ ఉన్నారు.

మహేష్‌ బాబు మరియు నమ్రతలు కూడా తమ అబ్బాయి గౌతమ్‌ ను ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఫోకస్‌ అయ్యేలా చేస్తున్నారు. సోషల్‌ మీడియాకు, పబ్లిక్‌ కార్యక్రమాలకు అప్పట్లో దూరంగా ఉండే మహేష్‌ బాబు ఇప్పుడు మాత్రం తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకోవడం చేస్తున్నాడు. ఆ సమయంలో గౌతమ్‌ గురించి, అతడి ఫొటోలను మహేష్‌ బాబు పోస్ట్‌ చేస్తున్నారు. మహేష్‌ బాబు భార్య నమ్రత కూడా తన కొడుకు గౌతమ్‌ ఫొటోలను రెగ్యులర్‌ గా పోస్ట్‌ చేయడంతో పాటు, కొడుకు, కూతురు గురించిన విషయాలను వెళ్లడిస్తూ వస్తోంది.

ఇక గౌతమ్‌ కు కూడా సోషల్‌ మీడియా పేజ్‌ లు ఉన్నాయి. తనకు సంబంధించిన ఫొటోలను గౌతమ్‌ వాటిలో అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటి నుండే అభిమానులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో గౌతమ్‌ తనను తాను ఫోకస్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక మహేష్‌ బాబు మరియు నమ్రతలు కూడా కొడుకు విషయంలో ఇప్పటి నుండే సోషల్‌ మీడియాలో ఫోకస్‌ అయ్యేలా చూస్తున్నారు. గౌతమ్‌ ను ఇప్పటి నుండే జనాల్లో ఉండేలా చేయడం వల్ల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ప్రేక్షకులు వెంటనే అతడిని ఓన్‌ చేసుకుంటారనే నమ్మకంతో ఇలా చేస్తూ ఉంటారు. మొత్తానికి గౌతమ్‌ పై నెటిజన్స్‌ ప్రస్తుతం చాలా ఆసక్తిగా ఉన్నారు. గౌతమ్‌ భవిష్యత్తులో సూపర్‌ స్టార్‌ అవుతాడేమో చూడాలి.