Begin typing your search above and press return to search.
భరత్ అను నేను.. ఫోకస్ ఆ వైపు?
By: Tupaki Desk | 6 March 2018 1:46 PM ISTటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా భరత్ అను నేను. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇంకా ఉన్న అరకొర సీన్ల షూటింగ్ కూడా అతి త్వరలో పూర్తి కానుంది. ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధమైపోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంపై చిత్ర యూనిట్ దృష్టి పెట్టింది. మంగళవారం సాయంత్రం విజన్ ఆఫ్ భరత్ పేరుతో ఈరోజు ఆరుగంటలకు ట్రైలరో... టీజరో విడుదల చేయనున్నారు.
కొరటాల శివ-మహేష్ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పడు మళ్లీ భరత్ అను నేను సినిమాతో ఆ కాంబో రిపీట్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ వర్క్ లో భాగంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ముఖ్యమంత్రి హోదాలో మహేష్ ఏదో మీటింగ్ నిర్వహిస్తున్నాడు. అతని ముందు ల్యాప్ టాప్ పెట్టి ఉంది. అందులో ద వ్యూస్ పేపర్ వెబ్ సైట్ పేరు టైప్ చేసి ఉంది. అందులో ఉన్న దానిని బట్టి ఆ సినిమాలో నేటి విద్యా విధానంపై ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. సినిమా కూడా ప్రస్తుత విద్యా విధానం... దానిని ఒక యువ ముఖ్యమంత్రి ఎలా మార్చాడు అన్నదానిపై నడుస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయ్.
నిజజీవితంలో కూడా మహేష్ బాబు విద్యకు ఎక్కువ ప్రాధాన్యమే ఇస్తారు. ఇటీవలే తన సొంత గ్రామం బుర్రిపాలెంలో... పెద్ద స్కూలును నిర్మించి ప్రారంభించారు. ఆ స్కూలుకు తన తల్లిదండ్రుల పేరు పెట్టాడు. తన చేతుల మీదుగానే ఆ స్కూలుకు ప్రారంబోత్సవం చేశారు. ఇప్పుడు ఆ అదే విద్యా రంగం గురించి తన సినిమాలో ఫోకస్ చేశాడు. ఈ సినిమాలో అతనికి జోడీగా కైరా అద్వాణీ కనిపించనుంది.