Begin typing your search above and press return to search.
బెస్ట్ ఫ్రెండ్ షిప్ డే పోస్ట్ మన సూపర్ స్టార్ దే!
By: Tupaki Desk | 6 Aug 2018 8:20 AM GMTభార్యభార్తలంటే టామ్ & జెర్రీలా ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారని - భర్తలు ఎప్పుడూ అబద్దాలు చెప్తూ భార్యలను మోసం చేస్తుంటే - భార్యలేమో భర్త రక్తాన్ని అప్పీ జ్యూస్ లా తాగుతారని ఓ జెనరల్ అభిప్రాయం. అది నిజమని లేదా అబద్దమని నమ్మడం మీకున్న అనుభవాన్ని బట్టి ఉంటుంది. వీటన్నిటికీ మించి భార్యభర్తలు మంచి ఫ్రెండ్స్ లా ఉండలేరని కూడా అంటుంటారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రతి దానికి ఓ ఎక్సెప్షన్ అయితే ఉంటుంది కదా. మరి ఆ ఎక్సెప్షన్స్ లో మహేష్ బాబు - నమ్రతలు ఉంటారు.
నిన్న ఫ్రెండ్ షిప్ డే. చాలామంది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని స్పెషల్ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. సోషల్ మీడియా లో ఫ్రెండ్షిప్ మెసేజులు - ఇమేజులతో సర్వర్లు జాం అయ్యేలా ట్రాఫిక్ పెంచి ఉంటారు. మరి మన టాలీవుడ్ సూపర్ స్టార్ తన స్టైల్ లో సోషల్ మీడియా ద్వారా 'మై ఫ్రెండ్! మై వరల్డ్. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే నమ్రత' అంటూ ఓ సింపుల్ మెసేజ్ బట్ పవర్ ఫుల్ పోస్ట్ పెట్టాడు. దాంతో పాటుగా ఒక పాత క్యూట్ ఫోటోను షేర్ చేశాడు. భార్య కనుక ఓ బెస్ట్ ఫ్రెండ్ అయితే అంతకంటే లక్కీ పర్సన్ ఎవ్వరూ ఉండరు.. ఆ లెక్కన మహేష్ సూపర్ స్టార్ మాత్రమే కాదు.. సూపర్ లక్కీ అని చెప్పాలి.
ఈ పోస్ట్ కు స్పందిస్తూ నమ్రత "నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను' అంటూ కామెంట్ పెట్టారు. మహేష్ - నమ్రతలది లవ్ మ్యారేజ్ అనే విషయం తెలిసిందే. పెళ్ళికి ముందు దాదాపు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు మంచి ఫ్రెండ్స్.. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అలానే ఫ్రెండ్స్ గా ఉండడం విశేషమే.