Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: చిలిపిగా మహేష్ బాబు

By:  Tupaki Desk   |   17 Nov 2018 10:20 AM IST
ఫోటో స్టొరీ: చిలిపిగా మహేష్ బాబు
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాకు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే అమెరికాలో ఒక షెడ్యూల్ ముగించుకుని 'మహర్షి' టీమ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో 'మహర్షి' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు వైఫ్ నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

"లాస్ట్ నైట్ బర్త్ డే పార్టీ @అగస్టీన్ జేవియర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో నమ్రత మహేష్ లతో పాటు మరో ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఇక మహేష్ మాత్రం సెల్ఫీ తీసే సమయలో చిలిపి కృష్ణుడి గా మారిపోయాడు. నమ్రత భుజంపై చెయ్యి వేసి ఫేస్ సగమే కనిపించేలా నమ్రత వెనక దాక్కున్నాడు. ఇక కళ్ళలో ఆ నాటీ ఎక్స్ ప్రెషన్ మాత్రం.. సో క్యూట్.. చూ చ్వీట్. అందుకేగా మహేష్ కు ఆ రేంజ్ ఫాలోయింగ్!

సోషల్ మీడియాలో ఈ ఫోటో ను చూసి మరో రకమైన చర్చలు కూడా మొదలయ్యాయి. మహేష్ తన కొత్త గెటప్ ను దాచేందుకే అలా చేశాడని కొందరు అంటున్నారు. కొందరేమో జస్ట్ ఫన్ కోసం అలా నాటీగా మారిపోయాడు అంటున్నారు. మహేష్ లాంటి సూపర్ స్టార్ ఏం చేసినా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోతుంది కదా!