Begin typing your search above and press return to search.

పిక్ టాక్: కొడుకుని హగ్ చేసుకుని మురిసిపోతున్న మహేష్...!

By:  Tupaki Desk   |   11 Nov 2020 11:50 AM GMT
పిక్ టాక్: కొడుకుని హగ్ చేసుకుని మురిసిపోతున్న మహేష్...!
X
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు 'సూపర్ స్టార్' గానే కాకుండా 'ఫ్యామిలీ మ్యాన్' అని కూడా పిలవబడుతుంటాడు. సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తూనే ఉంటాడు. ముఖ్యంగా తన పిల్లలు గౌతమ్ - సితార లతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా వారిని ఔటింగ్స్ కి తీసుకెళ్తుంటాడు. అందుకే అందరూ మహేష్ బాబు ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇటీవల మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్స్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన దగ్గరి నుంచి వెకేషన్ కు చెందిన ప్రతి ఫోటోను మహేష్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఫోటోని షేర్‌ చేశాడు.

ఇది మహేష్ బాబు తన కొడుకు గౌతమ్‌ తో దిగిన ఫొటో. ''ఇప్పుడు అతన్ని హగ్ చేసుకోవడం చాలా కష్టం.. కానీ ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి సరైన సమయం.. కారణం అవసరం లేదు'' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. చిరునవ్వులు చిందిస్తున్న తండ్రీకొడుకుల ఫోటో అభిమానులు ఆకర్షిస్తోంది. కాగా, మహేష్ - గౌతమ్ ఇద్దరూ తండ్రీ కొడుకులుగా కాకుండా అన్నదమ్ముల్లా స్నేహితులుగా ఎంజాయ్ చేస్తుంటారు. '1-నేనొక్కడినే' సినిమాలో మహేష్ చిన్ననాటి పాత్రను గౌతమ్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గౌతమ్ కొంచెం పెద్దవాడై లుక్స్ పరంగా హైట్ పరంగా తండ్రి మహేష్ కు కాపీలా మారుతున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు.