Begin typing your search above and press return to search.

బామ్మ అభిమానం..మహేష్‌ కలవబోతున్నాడు

By:  Tupaki Desk   |   8 Nov 2018 4:26 AM GMT
బామ్మ అభిమానం..మహేష్‌ కలవబోతున్నాడు
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానుల్లో అమ్మాయిు ఎక్కువగా ఉంటారు. అమ్మాయిలు మహేష్‌ అంటే చాలా అభిమానం చూపుతారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మాస్‌ - క్లాస్‌ అనే తేడా లేకుండా అందరిని తన అభిమానులను చేసుకున్న మహేష్‌ బాబుతో సెల్ఫీ దిగాలని 106 ఏళ్ల రాజమండ్రికి చెందిన బామ్మ ఆశ పడుతోంది. అప్పట్లో కృష్ణ అంటే - ఇప్పుడు మహేష్‌ బాబు అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఈ వయస్సులో కూడా మహేష్‌ బాబుతో కలిసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోందట.

ఈ బామ్మ గురించి అభిమానుల ద్వారా మహేష్‌ బాబు వరకు చేరిందట. బామ్మ ఆశపడుతున్నట్లుగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు మహేష్‌ బాబు సిద్దమయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు ‘మహర్షి’ చిత్రం కోసం విదేశాల్లో ఉన్నాడు. తర్వాత షెడ్యూల్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుపబోతున్నారు. ఆ సమయంలోనే ఆ బామ్మను కలిసేందుకు మహేష్‌ బాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అభిమానుల ద్వారా రాజమండ్రి నుండి ఆ బామ్మను హైదరాబాద్‌ కు రప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. 106 ఏళ్ల ఆ బామ్మ కోరుకున్నట్లుగా సెల్ఫీని మహేష్‌ బాబు ఇచ్చి ఆమెను ఆనంద పర్చబోతున్నాడట.

అమెరికాలో ఇప్పటికే మహర్షి షెడ్యూల్‌ పూర్తి అయ్యిందని - ఒకటి రెండు రోజుల్లో చిత్ర యూనిట్‌ సభ్యులు మొత్తం ఇండియాకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే కొత్త షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఇప్పటికే ఈ చిత్రం కోసం ఒక పల్లెటూరు సెట్‌ ను నిర్మించే పనిలో ఉన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.