Begin typing your search above and press return to search.

మహేష్ ఎమోషనల్ అయ్యాడు

By:  Tupaki Desk   |   23 April 2018 5:05 PM GMT
మహేష్ ఎమోషనల్ అయ్యాడు
X
టాలీవుడ్ హీరోల్లో చాలా మంది.. సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉందంటే నైట్ అస్సలు నిద్రపోలేరు. ఇక డిజాస్టర్స్ ఉన్న హీరోల సంగతి వర్ణనాతీతం. రిలీజ్ సమయం దగ్గరపడుతుంటే టెన్షన్ మొదలవుతుంది. ఎంతో ఒత్తిడి ఉంటుంది. అలాంటి తరహాలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫీల్ అయ్యాడట. రీసెంట్ గా విడుదలైన భరత్ అనే నేను మంచి విజయాన్ని అందుకుంది.

అందుకు గాను చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మహేష్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాటల్లో వణుకు భావోద్వేగాన్ని గుర్తు చేసింది. సినిమా హిట్ అయినందుకు సూపర్ స్టార్ ఎంత సంతోషంగా ఉన్నారో చేప్పేవచ్చు. ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివకి ఎంతో ఋణపడి ఉన్నట్లు తెలిపారు. శ్రీమంతుడు లాంటి సినిమాకు ముందు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి విజయాన్ని ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటీ హిట్ ఇచ్చారని అన్నారు.

ఇక దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. సినిమా డబ్బింగ్ అయిపోయిన తరువాత పనులు ఎంతవరకు వచ్చాయి అనే టెన్షన్ చాలా ఉన్నప్పుడు. దేవి శ్రీకి కాల్ చేయగానే కూల్ అయిపోయాను. మంచి పాటలు అందించడమే కాకుండా ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు కష్టపడినట్లుగా ఏ సినిమాకు కష్టపడలేదు అని చెప్పాలి. ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు అభిమానులకు ధన్యవాదాలని మహేష్ వివరించారు.