Begin typing your search above and press return to search.

బ్రేకప్ జంటలకు మహేష్ కొత్త ఫార్ములా

By:  Tupaki Desk   |   21 May 2016 11:30 AM GMT
బ్రేకప్ జంటలకు మహేష్ కొత్త ఫార్ములా
X
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక వైపు తుఫాన్ - మరోవైపు మూడు హిట్ సినిమాలు ఉండగా రిలీజ్ అవడం - స్క్రీన్ ప్లే నెరేషన్ మరీ స్లోగా ఉండడం.. బ్రహ్మోత్సవంపై బాగానే ఎఫెక్ట్ చూపాయి. సినిమా సంగతి ఎలా ఉన్నా.. బ్రహ్మోత్సవంలో బ్రేకప్ జంటలకు మహేష్ కొత్త ఫార్ములా ఒకటి అందించాడు.

సాధారణంగా ఇద్దరు ప్రేమికులు విడిపోవడం అంటే అది ఎమోషనల్ డిటాచ్ మెంట్. కానీ ఇలా బ్రేకప్ లను సినిమాల్లో చూపించేటపుడు నానా హంగామా - రచ్చ - అరుపులు - పెడబొబ్బలు - ఏడుపులు.. చూపిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవంలో మాత్రం మహేష్ పాత్ర ఇద్దరు హీరోయిన్స్ తో బ్రేకప్ అవుతుంది. మొదట మహేష్ నుంచి విడిపోవాలని కాజల్ పాత్ర నిర్ణయించుకుంటుంది. బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయేటపుడు ఓ లిప్ లాక్ వేసి వెళ్లిన కాజల్.. ఇక కనిపించదు.

సెకండాఫ్ లో కూడా సేమ్ సిట్యుయేషన్. రావు రమేష్ పాత్ర అన్న మాటలతో మహేష్ కు దూరం జరగాలని సమంత నిర్ణయించుకుంటుంది. వెళ్తున్నా కాని విడిపోవడం లేదని చెప్పి వెళుతూ.. ఓ లిప్ లాక్ వేస్తుంది. రెండు సార్లు బ్రేకప్ చెప్పిన భామలు ముద్దు పెట్టి వెళ్లడం విశేషం. బ్రేకప్ ని హుందాగా చూపించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ ని అభినందించాల్సిందే. ఈ సీన్స్ లో మహేష్ యాక్టింగ్ సూపర్బ్ అంతే. మరి మహేష్ చూపించిన ఈ బ్రేకప్ ఫార్ములాని.. ఎంతమంది ఫాలో అవుతారో?