Begin typing your search above and press return to search.

మహేష్ మరో షికారు.. త్రివిక్రమ్ ఓపికకు దండం!

By:  Tupaki Desk   |   13 Dec 2022 3:39 AM GMT
మహేష్ మరో షికారు.. త్రివిక్రమ్ ఓపికకు దండం!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని మాటల మాంత్రికుడు కూడా త్రివిక్రమ్ గత ఏడాది నుంచి ఎదురుచూస్తున్నాడు. అతను చివరగా అల్లు అర్జున్ తో అల.. వైకుంఠపురంలో సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా మహేష్ పూర్తిస్థాయిలో నమ్మకంగా ఉండడం లేదు. పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైతే గాని మహేష్ షూటింగ్ పూర్తి చేయాలని అనుకోవడం లేదని అర్ధమైంది.

ఒక ఎపిసోడ్ పూర్తయిన తర్వాత కూడా మహేష్ ప్రాజెక్టు క్యాన్సిల్ చేశాడు అంటే అతను ఎంత పట్టుదలతో ఉన్నడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రాజెక్ట్ బాగా రావాలి అనే ఆలోచనతోనే మహేష్ ఆలోచిస్తున్న విధానంకు త్రివిక్రమ్ కూడా ఒకే ఉంటున్నాడు. అలాగే త్రివిక్రమ్ పెద్దగా అభ్యంతరాలు చెప్పకుండా అతనికి నచ్చే వరకు కూడా స్క్రిప్ట్ రెడీ చేస్తూ ఉండడం విశేషం.

త్రివిక్రమ్ ఓపికకు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో సుకుమార్ మహేష్ బాబు ఈ తరహా కండిషన్స్ పెడితే వెంటనే వెనక్కి తప్పుకొని రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు. ఇక త్రివిక్రమ్ మాత్రం అలా కాకుండా ప్రస్తుతం మహేష్ బాబు తోనే సినిమా చేయాలి అని మరో కథను కూడా రెడీ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకునే లోపే మళ్లీ మరో మూడు వారాలపాటు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ఎందుకంటే మహేష్ బాబు ప్రతి క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఏదైనా వెకేషన్ కి వెళుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా అలా వెళ్లి జనవరి ఫస్ట్ వీక్ తర్వాత దాన్ని గాని అతను హైదరాబాద్ లో అడుగు పెట్టే ఛాన్స్ లేదు.

ఇక అప్పటివరకు త్రివిక్రమ్ మళ్ళీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే 2023 ఆగస్టులో SSMB 28 ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు కొంత ఆలస్యం చేయడం వలన అప్పటికి కూడా వచ్చే ఛాన్స్ లు అయితే తక్కువగానే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును ఎన్ని నెలల్లో పూర్తి చేస్తాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.