Begin typing your search above and press return to search.

మహేష్‌ 'గుంటూరు కారం' తో కొత్త బ్రాండింగ్‌ మొదలు పెట్టాడా?

By:  Tupaki Desk   |   3 Jun 2023 12:04 PM GMT
మహేష్‌ గుంటూరు కారం తో కొత్త బ్రాండింగ్‌ మొదలు పెట్టాడా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఎన్నో కంపెనీలకు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. సౌత్‌ స్టార్స్ లో అత్యధిక బ్రాండ్స్ ను ప్రమోట్‌ చేసిన ఘనత మహేష్ బాబుకు దక్కింది అనడంలో కూడా సందేహం లేదు. మహేష్‌ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త పుంతలు తొక్కే విధంగా ఒప్పందాలు చేసుకున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబు బ్రాండింగ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహేష్‌ బాబు తాజా చిత్రం గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. తాజాగా మహేష్ బాబు యొక్క ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో మహేష్ బాబు ధరించిన షర్ట్‌ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మహేష్ బాబు ధరించిన ఆ షర్ట్‌ కి మంచి డిమాండ్‌ ఉంది. ఈ కామర్స్ ద్వారా సదరు కంపెనీ యొక్క షర్ట్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముందుగానే మహేష్ బాబు ధరించిన షర్ట్ అవ్వడంతో అమ్మకాలు ఉంటాయని భావించిన కంపెనీ పెద్ద మొత్తంలో డెలివరీకి రెడీగా ఉంచినట్లుగా తెలుస్తోంది.

సదరు కంపెనీతో మహేష్ బాబు ఒప్పందం చేసుకుని గుంటూరు కారం సినిమా లో కనిపించాడా లేదంటే కాకతాళీయంగా జరిగిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే గుంటూరు కారం సినిమా ఫస్ట్‌ లుక్ లో మహేష్‌ బాబు ఏ షర్ట్‌ తో అయితే కనిపించాడో ఆ షర్ట్‌ కి విపరీతమైన డిమాండ్ ఉంది. రూ.3 వేల రూపాయలకు ఆన్‌ లైన్ లో సూపర్‌ ఫ్యాన్స్‌ వేలాదిగా కొనుగోలు చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది.