Begin typing your search above and press return to search.

వంద కోట్ల కంటే అదే సంతోషపెట్టిందట

By:  Tupaki Desk   |   14 Sep 2015 5:30 PM GMT
వంద కోట్ల కంటే అదే సంతోషపెట్టిందట
X
శ్రీమంతుడుతో తెలుగు సినిమాకి వంద కోట్ల స్టామినా ఉందని ప్రూవ్ చేశాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. వందల కోట్ల బడ్జెట్, మూడున్నరేళ్ల షూటింగ్ తో.. బాహుబలి ఈ రికార్డ్ అందుకోవడం కంటే.. మెసేజ్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో లింక్ చేసిన శ్రీమంతుడు ఈ ఫీట్ సాధించడమే పెద్ద రికార్డ్.

టాలీవుడ్ లో నెంబర్ ప్లేస్ - కమర్షియల్ మూవీల్లో నెంబర్ వన్ ప్లేస్.. ఈ రెండింటి కోసం టఫ్ ఫైట్ జరుగుతోంది. శ్రీమంతుడుతో టాప్ గ్రాసింగ్ మూవీ కావడంతో.. మహేష్ ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు. అయితే వంద కోట్లు కలెక్ట్ చేయడం కంటే మించిన హ్యాపీనెస్ మరోటి ఉందని చెబ్తున్నాడు మహేష్.

శ్రీమంతుడులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గానే ఉన్నా.. మెయిన్ కాన్సెప్ట్ మాత్రం సోషల్ మెసేజ్. ఇలా మెసేజ్ ఇచ్చి టాప్ హిట్ కొట్టడమంటే మామూలు విషయం కాదు. దీనికి తోడు ఇప్పుడీ చిత్రాన్ని అభినందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఓ ట్వీట్ ఇచ్చారు. శ్రీమంతుడు కారణంగా ఇలాంటి గౌరవం పొందే సంఘటనలు పలు ఎదురయ్యాయి సూపర్ స్టార్ కి. అందుకే వంద కోట్ల కంటే ఇదే ఎక్కువ సంతోషం ఇచ్చిందని చెబ్తున్నాడు మహేష్.