Begin typing your search above and press return to search.
రౌడీ బ్రాండ్ కు హంబుల్ కౌంటర్ ఇచ్చిందా?
By: Tupaki Desk | 8 Aug 2019 8:36 AM GMTఎంత స్టార్ స్టేటస్ ఉన్నా.. వరుస మూవీల్లో బిజీగా ఉన్నా.. తమ పేరుకు ఉండే క్రేజ్ తో బిజినెస్ చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్ ఈ మధ్యన నటీనటుల్లో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు క్లాతింగ్ బిజినెస్ లోకి దిగేసి.. తమదైన బ్రాండ్స్ తో దూసుకెళుతున్నారు. ఇప్పుడు వారి బాటలోనే నడుస్తున్నారు టాలీవుడ్ హీరోలు.
టాలీవుడ్ యూత్ సంచలనం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో మస్తు బిజీగా ఉన్నప్పటికీ బిజినెస్ ప్లాన్లను అస్సలు వదిలిపెట్టటం లేదు. తాను యాక్టర్ గా మర్చిపోయి బానిసలా పని చేస్తున్నట్లుగా చెప్పుకునే విజయ్.. ఈ మధ్యనే రౌడీ పేరుతో డిజైన్లను తెర మీదకు తేవటం తెలిసిందే. తనను అభిమానించే అభిమానుల్ని ముద్దుగా రౌడీస్ అని పిలవటం ద్వారా.. కొత్త తరహా క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తనదైన శైలిలో దూసుకెళుతున్నాడు.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా తన క్లాతింగ్ బ్రాండ్ ను లాంచ్ చేయటం తెలిసిందే. తన బ్రాండ్ కు హంబుల్ అనే పేరును ప్రకటించారు. హంబుల్ ఇంగ్లిషు అక్షరాల్లో ఎంబీ (మహేశ్ బాబు) అని ఉండటం.. ఇదంతా అనుకోకుండా జరిగిందే తప్పించి ప్లాన్ చేసింది కాదని చెప్పుకొచ్చారు. ఇంతకీ హంబుల్ అనే పేరుతో బ్రాండింగ్ ఎందుకు చేయాలనుకున్నారు? ఆ పేరునే ఎందుకు డిసైడ్ చేశారంటే.. మహేశ్ వ్యాపార భాగస్వామి ఆసక్తికర సమాధానాన్ని చెప్పారు.
ఈ పేరును డిసైడ్ చేయటానికి ముందు భారీ ఎత్తున ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నామని.. మహేశ్ కు ఉండే ఇమేజ్.. అతన్ని ఎలా పిలుస్తారు? అతని వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారు? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తాము రీసెర్చ్ చేసిన తర్వాత నాలుగైదు అనుకుుంటే.. అందులో హంబుల్ ఒకటని.. దాన్నే ఫైనల్ చేసినట్లుగా చెప్పారు.
హంబుల్ అనే పదానికి తెలుగులో వినయం.. అణుకువ అన్న అర్థం వస్తుంది. సూపర్ స్టార్ అయినప్పటికీ వినయం.. అణుకువతో మనసుల్ని దోచుకునే మహేశ్ తనకు తగిన రీతిలో తన క్లాతింగ్ బ్రాండ్ పేరును ఎంపిక చేసుకున్నారని చెప్పినప్పటికీ.. రౌడీ బ్రాండ్ కు చెప్పకనే చెప్పినట్లుగా కౌంటర్ ఇచ్చినట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రౌడీ అనే నెగిటివ్ వర్డ్ ను కొత్త తరహా ఇమేజ్ తెచ్చే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ ఉంటే.. దానికి పూర్తి భిన్నంగా అణుకువ పేరుతో బ్రాండ్ ను బయటకు తీసుకురావటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రానున్న రోజుల్లో రౌడీ వర్సెస్ హంబుల్ అన్నట్లుగా పరిస్థితి మారే అవకాశం ఉంటుందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.