Begin typing your search above and press return to search.
మహేష్ ఫీలవడం కాదు.. హర్టయ్యాడట
By: Tupaki Desk | 23 May 2016 11:30 AM GMTటాలీవుడ్లో ప్రతి హీరోకూ ఫ్లాపులన్నాయి.. అట్టర్ ఫ్లాపులున్నాయి.. డిజాస్టర్లూ ఉన్నాయి. మహేష్ బాబు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. వంశీ.. బాబీ.. 1 నేనొక్కడినే.. ఆగడు.. లాంటి డిజాస్టర్లు మహేష్ బాబు ఖాతాలో ఉన్నాయి. ఐతే వంశీ.. బాబీ సినిమాల సంగతి తీసుకుంటే అవి కెరీర్ తొలి నాళ్లలో చేసిన సినిమాలు. సినిమాల ఎంపికలో మహేష్ కు అప్పుడంత మెచ్యూరిటీ లేదు. కాబట్టి వాటి సంగతి వదిలేద్దాం.
ఇక ‘1 నేనొక్కడినే’ సంగతి తీసుకుంటే.. ఆ సినిమా విషయంలో మహేష్ ఎప్పుడూ రిగ్రెట్ కాలేదు. ‘1’ ఫ్లాపైనా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. మహేష్ కు గౌరవాన్నే తెచ్చిపెట్టింది. ఒక్క ‘ఆగడు’ విషయంలోనే తాను తప్పు చేశానని అంటుంటాడు మహేష్. ఐతే అది కమర్షియల్ సినిమా కాబట్టి మహేష్ కాన్షియస్ గానే గ్యాంబ్లింగ్ ట్రై చేశాడని అనుకోవచ్చు. ఐతే ‘బ్రహ్మోత్సవం’ సినిమానే మహేష్ నమ్మకాన్ని దారుణంగా దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది.
కమర్షియల్ గా దారుణమైన ఫలితాన్ని చవిచూడబోతుండటమే కాదు.. తీవ్ర విమర్శలు కూడా తెచ్చిపెడుతోంది ఈ సినిమా. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పాటు మహేష్ ను కూడా తిట్టిపోస్తున్నారు. మహేష్ జడ్జిమెంట్ ఇంత పూరా.. ఇలాంటి సినిమా ఎలా చేశాడంటున్నారు. థియేటర్ల నుంచి బయటికి వస్తున్న జనాల్లో తీవ్ర ఆగ్రహం.. అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తానికి ‘బ్రహ్మోత్సవం’ మహేష్ కు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్నాపకం అయ్యేలా ఉంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ విషయంలో మహేష్ కూడా చాలా చాలా ఫీలయ్యాడట.
‘బ్రహ్మోత్సవం’కు డివైడ్ టాక్ వస్తుందని ముందే అంచనా వేసినప్పటికీ.. ఇంత తీవ్ర స్థాయిలో నెగెటివ్ టాక్ మాత్రం అంచనా వేయలేదట మహేష్. ఫ్యామిలీ సినిమా కాబట్టి స్లో స్టార్ట్ ఉన్నప్పటికీ.. సరిగా ప్రమోట్ చేస్తే పుంజుకుంటుందని.. ఓ మోస్తరు కలెక్షన్లతో బయటపడుతుందని భావించారట. కానీ ఆ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. మహేష్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ కాబోతుండటమే కాదు.. తీవ్ర విమర్శల్ని కూడా తీసుకుంటోందీ సినిమా. ఇంతకుముందు ‘ఆగడు’ దెబ్బకు రెండు నెలలు బయటికే రాలేకపోయానన్న మహేష్.. ‘బ్రహ్మోత్సవం’ ప్రభావం నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో?