Begin typing your search above and press return to search.

10డే వెకేష‌న్ ప్లాన్ లో మ‌హేష్

By:  Tupaki Desk   |   10 April 2019 6:28 AM GMT
10డే వెకేష‌న్ ప్లాన్ లో మ‌హేష్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ గ‌త ఏడాది కాలంగా `మ‌హ‌ర్షి` సినిమా కోసం అలుపెర‌గ‌కుండా శ్ర‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. `భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో ద‌క్కిన‌ స‌క్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాల‌ని రాజీ అన్న‌దే లేకుండా శ్ర‌మిస్తున్నారు. ఏప్రిల్ 20తో మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. అప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ పై పెండింగ్ సీన్స్, పాట‌ల్ని పూర్తి చేస్తార‌ట‌.

`మ‌హ‌ర్షి` చిత్రీక‌ర‌ణ ఇంకా ఎంత పెండింగ్ ఉంది? అంటే .. దాదాపు ముగింపులో ఉంది. కొన్ని మాంటేజ్ సీక్వెన్సుల‌తో పాటు కొన్ని పాట‌ల్ని తెర‌కెక్కించాల్సి ఉంది. మ‌హేష్ స‌హా కీల‌క న‌టుల‌పై వీటిని చిత్రీక‌రిస్తారు. హైద‌రాబాద్, అబూద‌బీలో వీటికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. ఏప్రిల్ 20 డెడ్ లైన్ పెట్టుకుని పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేస్తున్నార‌ని తెలుస్తోంది.

అటుపై మ‌హేష్ ప్ర‌చార బ‌రిలోకి దిగుతార‌ట‌. అయితే అత‌డు మీడియా ముందుకు రాక‌ ముందే 10రోజుల ఫ్యామిలీ వెకేష‌న్ పూర్తి చేసుకుంటార‌ని తెలిసింది. మే 9న మ‌హ‌ర్షి చిత్రం రిలీజ్ కానుంది. అంత‌కు వారం ముందే మ‌హేష్ మీడియా ప్ర‌మోష‌న్స్ కి అందుబాటులోకి వ‌స్తార‌ట‌. సినిమాలు రిలీజ్ గ్యాప్ లో మ‌హేష్ ఇలా వెకేష‌న్ కి వెళ్ల‌డం కొత్తేమీ కాదు. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను షూటింగులు పూర్తి కాగానే పిల్ల‌లు స‌హా కుటుంబ స‌మేతంగా మ‌హేష్ ఫ్యామిలీ వెకేష‌న్స్ వెళ్లారు. ఈసారి కూడా మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ అయిపోగానే విదేశాల‌కు వెళుతున్నార‌ని తెలుస్తోంది.