Begin typing your search above and press return to search.
వ్వాట్! మహేష్ ఆరెంజ్ చొక్కా అంత కుట్ర దాగుందా?
By: Tupaki Desk | 8 May 2022 10:52 AM GMTసూపర్ స్టార్ మహేష్ నటించిన `సర్కార్ వారి పాట` మే 12న అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ ప్రమోషన్స్ తో పూర్తి బిజీ అయిపోయారు. నిన్నటికి నిన్న `సర్కారు వారి పాట` ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఎంబీ అభిమానులు ఈ వేడుక కోసం భారీగా తరలి వచ్చారు.
వేడుకలో ఛమక్కులు ఆకట్టుకున్నాయి. అయితే అన్నిటినీ మించి ఈ వేదిక లో మహేష్ ఆరెంజ్ చొక్కా అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఎంబీ ఏంటో కానీ ఈసారి కొత్తగా కనిపిస్తున్నారు. మునుపటిలా ప్లెయిన్ చొక్కాలో సింపుల్ గా వచ్చేయలేదు.. సాఫ్ట్ గా అసలే కనిపించలేదు అంటూ గుసగుస వేడెక్కిస్తోంది. అసలు MB ఆరెంజ్ షర్ట్ వెనక అసలు సంగతి ఏమై ఉంటుంది? అన్నది నెటిజనుల్లో పెద్ద డిబేట్ గా మారింది.
ఇలా కలర్ ఫుల్ లుక్ లో ఎంతో అందంగా ఉన్నాడంటూ కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు మహేష్ కూడా హిందుత్వకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాడని అందుకే అతను నారింజ రంగు చొక్కా ధరించాడని గుసగుసలు మొదలు పెట్టారు. అయితే ఈ రెండో కోణం మాత్రం ఊహకు కూడా అందనిది. మహేష్ అలా ఆలోచిస్తాడని ఆయన గురించి తెలిసిన ఎవరూ అనుకోలేరు. రాజకీయాపైనా కుల మతాలతో ముడిపడిన కుంచితత్వ భావజాలంపైనా మహేష్ ఎపుడూ ఆసక్తిగా లేరు. అలాంటిది ఇది ఊహించడానికే భయంగా ఉంది..!! అని కొందరు అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేసే నటుడు మహేష్ కాదు కాబట్టి ఈ యాంగిల్ చాలా సిల్లీగా కనిపిస్తోంది.
అయితే సోషల్ మీడియాల్లో ఇలాంటి డిబేట్లు నిరంతరం చూసేవే. వీటిలో చాలా అసంబద్ధమైనవి. గతంలో ఉత్తరాదిన `ది కాశ్మీర్ ఫైల్స్` పైనా కొందరు బురద జల్లారు. వాస్తవిక కథను చూడటం కంటే ఇతర కోణాలను ఆరాలు తీసారు. కశ్మీర్ ఫైల్స్- ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాలకు హిందూత్వ కోణాన్ని ఆపాదించారు. ఇక RRR లో అల్లూరి పాత్రలో నటించిన రామ్ చరణ్ ని తప్పుబట్టారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై చాలా కాలంగా ఇలాంటి విమర్శలు ఉన్నాయి. అతడు హిందూత్వకు కొమ్ము కాస్తాడని విమర్శించేవాళ్లు లేకపోలేదు.
అయితే ఇప్పుడు మహేష్ నారింజ చొక్కాకి హిందూత్వను ఆపాదించడం సబబేనా? అంటే అది నెటిజనుల ఇష్టం. అయితే SVP ఉత్తరాదిలో విడుదల కానే కాదు. ఈ చిత్రం దక్షిణాది నుంచి వస్తున్నది కావడం వల్ల ఈ వాదన ఏమాత్రం సబబు కాదని భావించాలి. కానీ సోషల్ మీడియాలో విచిత్ర వాదనలు వినిపిస్తున్నాయి. మహేష్ ఎన్నడూ లేనిది కొత్తగా ఆరెంజ్ లుక్ లో కలర్ ఫుల్ గా కనిపించడమే దీనికి కారణం. అయితే ఇది ఎస్.వి.పి సినిమా టోన్ ని ప్రతిబింబించే లుక్ అని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందులో మహేష్ క్లాస్ అప్పీల్ తో కనిపించరు. పూర్తిగా మాస్ అవతార్ లో దుమ్ము రేపనున్నారని ట్రైలర్ చెబుతోంది. భరత్ అనే నేను- శ్రీమంతుడు కాన్సెప్టులతో పోలిస్తే పాత్ర పరంగా ఇది పూర్తి వైవిధ్యమైనది మాసీగా ఉంటుందని ఇప్పటికే విజువల్స్ నిరూపించాయి.