Begin typing your search above and press return to search.

సర్కారు.. మ‌హేష్ సెటిమెంట్ థియేట‌ర్లోనే

By:  Tupaki Desk   |   5 May 2022 1:30 PM GMT
సర్కారు.. మ‌హేష్ సెటిమెంట్ థియేట‌ర్లోనే
X
సినీ ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్ ల‌కు పెద్ద పీట వేస్తంటారన్న‌ది తెలిసిందే. ముహూర్త టైమ్ ద‌గ్గ‌రి నుంచి మెయిన్ థియేట‌ర్ వ‌ర‌కు ప్ర‌తీదీ సెంటిమెంట్ గానే భావిస్తుంటారు. అయితే అభిమానులు కూడా గ‌త కొన్నేళ్లుగా సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు. ఫ‌లానా థియేట‌ర్లో త‌మ అభిమాన‌ సినిమా సినిమా విడుద‌లైతే బ్లాక్ బ‌స్ట‌ర్ గ్యారెంటీ అని న‌మ్ముతుంటారు. అలాంటి సెంటిమెంటే సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు వుంది. ఎన్ని మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లు వున్నా సింగిల్ స్క్రీన్స్ లో న‌చ్చిన స్టార్ హీరో సినిమాకుండే క్రేజే వేరు.

అందుకే అభిమానులు ఎక్కువ‌గా బెనిఫిట్ షోల‌ని సింగిల్ స్క్రీన్ ల‌లో చూడ‌టానికే అధిక ప్రాధాన్య‌త నిస్తుంటారు. హైద‌రాబాద్ లో స్టార్ హీరో సినిమా చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వుండే సింగిల్స్ స్క్రీన్స్ లో చూడాల్సిందే. మ‌రీ ప్ర‌ధానంగా సుద‌ర్శ‌న్ థియేట‌ర్ కాంప్లెక్స్ లో ఫ్యాన్స్ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇక్క‌డ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌రే. ఇది ఇండ‌స్ట్రీలో వున్న ప్ర‌తీ స్టార్ ప్రొడ్యూస‌ర్ నుంచి స్టార్ డైరెక్ట‌ర్ ల వ‌ర‌కు తెలుసు. అందుకే సినిమా చూడాలన్నా, టాక్ గురించి తెలుసుకోవాల‌న్నా ఇండ‌స్ట్రీ వాళ్లు ముందు వెళ్లేది.. ఫోన్ చేసేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వున్న థియేట‌ర్ల‌కే.

ఈ సంప్ర‌దాయం న‌గ‌రంలో మ‌ల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగినా ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే వుంది. ఇక అభిమానుల‌కు కూడా ఓ సెంటిమెంట్ వుంది త‌మ అభిమాన హీరో సినిమాని ఈ ఏరియాలోనే చూడాల‌నుకుంటారు. అక్క‌డ జ‌రిగే హంగామా అలా వుంటుంది మ‌రి. మాస్ ఊల‌లు.. అరుపుల‌తో గోల గోల‌గా వుంటుంది. అందుకే ఆ క్కిక్కుని మిస్ కాకూడ‌ద‌ని ప్ర‌త్యేకంగా ఫ్యాన్స్ అత్య‌ధికంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వున్న మెయిన్ థియేట‌ర్ల‌లోనే సినిమా చూడాల‌నుకుంటారు.

ఇదిలా వుంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానుల‌కు ఓ సెంటిమెంట్ వుంది. మ‌హేష్ న‌టించిన ప్ర‌తి సినిమా ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో వున్న సుద‌ర్శ‌న్ 35 లో రిలీజ్ కావాల్సిందే. అలా రిలీజ్ అయిన మ‌హేష్ సినిమాలు చాలా వ‌ర‌కు ఇండ‌స్ట్రీ హిట్, బ్లాక్ బ‌స్ట‌ర్ లు గా నిలిచాయి. అంతే కాకుండా ఇదే థియేట‌ర్లో మ‌హేష్ సినిమాల శ‌త‌దినోత్స‌వాలు, సిల్వ‌ర్ జూబ్లీ ఫంక్ష‌న్ లు జ‌రిగాయి. ఇదే థియేట‌ర్లో మ‌హేష్ తాజా మూవీ `స‌ర్కారు వారి పాట‌` కూడా విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని భావించారు. ఇందు కోసం టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌. అయితే మొత్తానికి అభిమానుల సెంటిమెంట్ ప్ర‌కారం `స‌ర్కారు వారి పాట‌` మెయిన్ థియేట‌ర్ సుద‌ర్శ‌న్ 35 లోనే విడుద‌ల‌వుతోంది.

అయితే ఇందులో ఓ చిక్కొచ్చిప‌డింది. ఇదే థియేట‌ర్లో ప్ర‌స్తుతం `ట్రిపుల్ ఆర్‌` న‌డుస్తోంది. మ‌హేష్ సినిమా రిలీజ్ నాటికి 48 రోజులు అవుతున్నాయి. ముందు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం 50 డేస్ పూర్తి చేయ‌కుండా ఈ మూవీని తీసివేయ‌డం కుద‌ర‌ని ప‌ని. ఒక వేళ తీసేస్తే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్టం. దీంతో మ‌హేష్ సినిమాకు వేరే థియేట‌ర్ ని కేటాయించి సుద‌ర్శ‌న్ 35 ని మే 27న విడుద‌ల కానున్న `ఎఫ్ 3`కి కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇది దిల్ రాజు సినిమా. ఇక ట్రిపుల్ ఆర్ ని విడుద‌ల చేసింది దిల్ రాజే. ఇప్ప‌డు `స‌ర్కారు వారి పాట‌`ని నైజాంలో విడుద‌ల చేస్తున్న‌ది కూడా దిల్ రాజే కావ‌డంతో ఆయ‌న‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

అయితే ఫ్యాన్స్ సెంటిమెంట్ థియేట‌ర్ ని కాకుండా వేరే థియేట‌ర్ ని కేటాయించ‌డంతో ఫ్యాన్స్ రంగంలోకి దాగి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ సుద‌ర్శ‌న్ 35 కావాల్సిందే అని మొత్తానికి సాధించుకున్నార‌ట‌. అయితే ట్రిపుల్ ఆర్ ని తీసేయ‌కుండానే `స‌ర్కారు వారి పాట‌` రెండు లేదా మూడు షోల‌కు ప‌రిమితం చేశార‌ట‌. `ట్రిపుల్ ఆర్` 50డేస్ ప‌డ్డాక పూర్తిగా థియేట‌ర్ ని `స‌ర్కారు వారి పాట‌`కే కేటాయిస్తార‌ట. ఇదే థియేట‌ర్లో మ‌హేష్ న‌టించిన ఒక్క‌డు నుంచి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కు వ‌రుస‌గా 6 చిత్రాల వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు గా నిలిచి మ‌హేష్ కు ఈ థియేట‌ర్ సెంటిమెంట్ గా మారేలా చేశాయి.