Begin typing your search above and press return to search.

SSMB28.. బాడీ బిల్డ‌ర్ కం ఏజెంట్ స్టోరి?

By:  Tupaki Desk   |   21 Aug 2022 9:30 AM GMT
SSMB28.. బాడీ బిల్డ‌ర్ కం ఏజెంట్ స్టోరి?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని ఇస్మార్ట్ లుక్ లో చూసేందుకే అంతా అల‌వాటు ప‌డిపోయాం. అలాంటి క‌ళ్ల‌కు మ‌హేష్ ష‌ర్ట్ లెస్ గా క‌నిపిస్తే..? అది కూడా బాడీ బిల్డ‌ర్ లుక్ లో క‌నిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. దానికి తోడు అత‌డు ఒక  స్పై లేదా ఏజెంట్ పాత్ర‌లో న‌టిస్తే మ‌జాక్ ఇంకాస్త పీక్స్ కి చేరుకుంటుంది. ఈసారి అలాంటి ట్రీట్ ఇచ్చేందుకు మ‌హేష్ స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని ఊహాగానాలు సాగుతున్నాయి.

నిన్న‌టికి నిన్న‌ మహేష్ బాబు చొక్కా లేకుండా స్విమ్మింగ్ పూల్ లో క‌నిపించిన తీరు చూడ‌గానే అభిమానుల్లో త‌దుప‌రి చిత్రంపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఈసారి మ‌హేష్ రొటీన్ కి భిన్నంగా క‌నిపిస్తారు. అత‌డు స‌రికొత్త‌ అవతార్ లో క‌నిపించేందుకు ఆస్కారం లేక‌పోలేదని ఊహాగానాలు సాగుతున్నాయి. షర్ట్ లెస్ గా ఒక స్నాప్ ఇంటర్నెట్ లో కనిపించ‌గానే ఇన్నిర‌కాలుగా ఊహాగానాలు సాగాయి.  ఆ ఫోటో కూడా కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

ఇది త్రివిక్రమ్ SSMB28 లుక్ అన్న ప్ర‌చారం సాగిపోయింది. తన తదుపరి చిత్రంలో మహేష్  ఇలా క‌నిపిస్తాడు! అంటూ అభిమానులు జోరుగా ప్ర‌చారం చేసేసారు. అయితే కొత్తగా విడుదలైన ఆ ఫోటోగ్రాఫ్‌ కేవలం అనుభూతి ఊహాగానం మాత్ర‌మే. అస‌లు వాస్త‌వం ఏమిటో త్రివిక్ర‌మ్ స్వ‌యంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్ గా నటిస్తున్నాడని అందుకే ఫిజిక్ ని సిద్ధం చేసుకున్నాడని కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే త్రివిక్రమ్ మార్క్ ప్రెజెంటేషన్ తో మహేష్ ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించడం ఐ ఫీస్ట్ అవుతుంది. SSMB28 సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.