Begin typing your search above and press return to search.
సుధీర్ బాబు నిర్మాణంలో మహేష్ బాబు
By: Tupaki Desk | 10 Feb 2022 8:30 AM GMTసూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి 'ఎస్ఎంఎస్' అనే సినిమాతో హీరోగా సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు అయ్యింది. కృష్ణ చిన్న కూతురు.. మహేష్ బాబు సోదరి భర్త అయిన సుధీర్ బాబుకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే లభించినా ఆయన ఇన్నాళ్ల కెరీర్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. స్టార్ వారసత్వం అనేది ఎంట్రీ వరకు పనికి వస్తుంది కాని ఆ తర్వాత ఆ వారసుడు కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనేది సుధీర్ బాబు విషయంలో కూడా మరోసారి నిరూపితం అయ్యింది.
సుధీర్ బాబు మొదటి సినిమా నిరాశ పర్చడంతో తదుపరి సినిమా కోసం మరింత కష్టపడ్డాడు. యాక్టింగ్ వర్క్ షాప్ లకు వెళ్లడంతో పాటు డాన్స్ ల్లో మరియు మార్షల్ ఆర్ట్స్ పై శిక్షణ ఇలా ఎంతో కష్టపడి మరీ సుధీర్ బాబు ఒక స్థాయికి వచ్చాడు. ఆయన జర్నీలో మహేష్ బాబు మరియు కృష్ణల ప్రోత్సాహం ఉన్నా కూడా ఆయన కష్టం ఆయన్ను ఈ స్థాయికి తీసుకు వెళ్లింది అనడంలో సందేహం లేదు.
సుధీర్ బాబు తన సినీ కెరీర్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు. తన కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నా గురించి సినిమాటోగ్రాఫర్ మరియు ఆయన అసిస్టెంట్ అవహేళన చేస్తూ మాట్లాడుకోవడం విన్నాను. నా యొక్క లుక్ పట్ల కొన్ని కామెంట్స్ ను నేను పాజిటివ్ గా తీసుకుని ఛాలెంజ్ గా నన్ను నేను మార్చుకున్నాను.
ప్రతి ఒక్క సినిమాలో కూడా ది బెస్ట్ ఇచ్చేందుకు నేను ప్రయత్నించాను. నా ఈ జర్నీలో నా కుటుంబ సభ్యులు.. నా దర్శకులు.. నా నిర్మాతలు.. నా సహ నటీ నటులు.. నన్ను విమర్శించిన వారు ఇలా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. వారందరి వల్లే తాను పదేళ్ల కాలంను విజయవంతంగా పూర్తి చేసుకుని ఎన్నో మంచి సినిమాలు చేశాను అన్నాడు.
మహేష్ బాబు తో అనుబంధం గురించి మరియు ఇద్దరి కాంబోలో సినిమా గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ... నేను మహేష్ బాబుతో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాను. మహేష్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. మహేష్ తో ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం. చాలా కూల్ అండ్ ఎంటర్టైనింగ్ పర్సన్ అంటూ మహేష్ బాబు గురించి సుధీర్ బాబు అన్నాడు.
ఇక మహేష్ బాబుతో సినిమా నిర్మించడం కోసం కూడా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మంచి కథ తో వస్తే మహేష్ బాబుతో సినిమాను నిర్మిస్తానంటూ సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. ఆ కథ ఎప్పుడు వస్తుంది.. ఎవరి ద్వారా వస్తుందా అని అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.