Begin typing your search above and press return to search.
ఎఫ్ -3 : రవితేజ వర్సెస్ మహేష్.. ఎవరికి ఛాయిస్?
By: Tupaki Desk | 8 Feb 2020 2:20 PM ISTఅపజయమెరగని దర్శకుల జాబితాలో అనీల్ రావిపూడి పేరు మార్మోగుతోంది. వరుసగా బ్లాక్ బస్టర్లు సాధిస్తూ.. తెలుగు ఆడియెన్ పల్స్ తెలిసిన వాడిగా మార్కెట్ వర్గాల్లో గ్రిప్ పెంచుకున్నాడు. కంటెంట్ రొటీన్ అయినా ఏదో ఒక లాజిక్ తో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో మైమరిపించడం రావిపూడి శైలి అన్న టాక్ వినిపిస్తోంది. రాజా ది గ్రేట్, ఎఫ్-2, ఇటీవలే సరిలేరు నీకెవ్వరు ఇవన్నీ ఈ తరహానే. సూపర్ స్టార్ మహేష్ తో బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ చేసిన సందడితో సంక్రాంతి రేసులో దూకుడు చూపించగలిగారు. ప్రస్తుతం అనీల్ కు మార్కెడ్ లో డిమాండ్ రెట్టింపైందని తెలుస్తోంది.
స్టార్ హీరోలే అతని కోసం క్యూ కట్టే సన్నివేశం తలపిస్తోందట. ఇదే స్పీడ్ ను కొనసాగించాలని అనీల్ రావిపూడి సైతం తహతహలాడుతున్నాడు. దీనిలో భాగంగా కొత్త జానర్ జోలికి వెళ్లకుండా హిట్టు ఇచ్చిన ఫార్ములనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు. ఎఫ్-2 సీక్వెల్ గా ఎఫ్ -3 తెరకెక్కించడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇదే ఏడాది చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఎఫ్ -2 హీరోలు వెంకటేష్- వరుణ్ తేజ్ లనే ఎఫ్3 కోసం మరోసారి బరిలో దించుతున్నాడు. పక్కన మరో నంబర్ కూడా యాడ్ అయింది కాబట్టి మరో స్టార్ హీరో కూడా అవసరమే. అందుకే ఆ రోల్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని నటించాల్సిందిగా కోరారని కోందరు...కాదు రవితేజను ఇంతకుముందే లాక్ చేసారని మరికొందరు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత? మహేష్ నిజంగా అంగీకరించారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ మహేష్ గనుక నటిస్తే ఎఫ్-3 ప్రథమార్థంలో మహేష్ కనిపించడట. ద్వితీయార్థంలోనే మహేష్ పాత్ర కనిపిస్తుందని..అక్కడ నుంచి ఆ రోల్ రప్ఫాడించేస్తుందని చెబుతున్నారు. దాదాపు అర్థగంట పైగా తెరపై మెరుపులేనట.
విన్నది నిజమే అయితే మహేష్ అభిమానులకు పండగే. అయితే 40 నిమిషాల పాత్రలో మహేష్ నటించడం అన్న దానిపై చాలా సందేహాలున్నాయి. మహేష్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్లలలో ఒకరు. స్క్రిప్ట్ విషయంలో ఓ ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ఒకే జానర్లో సినిమాలు చేసి దెబ్బ తిన్న అనుభవం మహేష్ కి ఉంది కాబట్టి.. ఎఫ్-3 లో నటిస్తారా? అన్న దానిపై ఆయన నుంచి క్లారిటీ వస్తే గానీ ఖరారు చేయలేం. ఈ పాత్ర కోసం రవితేజ పేరు కూడా అంతే బలంగా వినిపిస్తుంది. మాస్ రాజా ఊరమాస్ కామెడీగా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన కామెడీ ముందు ఎంతటివారైనా తేలిపోవాల్సిందే.