Begin typing your search above and press return to search.
మహేష్ బాబు చాలా మారాడండోయ్
By: Tupaki Desk | 24 March 2018 10:13 AM GMTమహేష్ బాబు పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా వీక్ అన్నది ఇండస్ట్రీ జనాల అభిప్రాయం. ఫాలోయింగ్ విషయంలో తిరుగులేకపోయినా.. ఆ ఫాలోయింగ్‌ను సరిగా మేనేజ్ చేసుకోవడంలో మహేష్ బాబు ఫెయిలే అంటుంటారు. మహేష్ సినిమాలకు ఏమాత్రం తేడా వచ్చినా.. అవి డిజాస్టర్లవడానికి ఇదే కారణమని.. సోషల్ మీడియాలో నెగిటివిటీని తిప్పి కొట్టేలా అభిమానుల్ని సన్నద్ధం చేసేవాళ్లే ఉండరని.. అల్లు అర్జున్ లాంటి హీరోల పీఆర్ టీంలు.. ఫ్యాన్స్ గ్రూప్స్ ల మాదిరి సినిమాను పుష్ చేసే వాళ్లు లేకపోవడం వల్లే మహేష్ సినిమాలకు మరీ ఆ స్థాయి ఫలితాలు వస్తుంటాయని విశ్లేషిస్తుంటారు ఇండస్ట్రీ జనాలు. ఈ విషయం గుర్తించేనేమో.. ప్రత్యేకంగా పీఆర్ టీంను ఏర్పాటు చేసుకున్నాడు మహేష్ బాబు. టీం మహేష్ బాబు పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచి మహేష్ సినిమాల్ని.. కార్యకలాపాల్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంది ఈ బృందం.
ఇందులో భాగంగానే అభిమానుల్ని కూడా మొబిలైజ్ చేయడం.. వాళ్లను మహేష్ బాబుతో కలిపించి ఉత్సాహం నింపే బాధ్యతను పీఆర్ టీం తీసుకుంది. ‘భరత్ అనే నేను’ షూటింగ్ సందర్భంగా ఇలా 4200 మంది అభిమానుల్ని వ్యక్తిగతంగా కలిశాడట మహేష్. రోజుకు ఇంతమంది అని లెక్క వేసి ప్రతి రోజూ కొంత సమయం అభిమానులకు కేటాయించాడట. వారితో మాట్లాడి సంతోషపెట్టడమే కాక.. ఫొటోలు కూడా దిగుతున్నాడు కొన్ని రోజులుగా. అలా మొత్తం 4200 మందిని కలిశాడట. గతంలో మహేష్ తండ్రి కృష్ణ కూడా ఇలాగే ప్రతిరోజూ అభిమానుల్ని కలిసి వారిలో సంతోషం నింపేవాడు. ఇప్పుడు మహేష్ కూడా అదే బాటలో నడవడం విశేషమే. మామూలుగా రిజర్వ్ డ్ గా ఉండే మహేష్.. ఇలా ఉంటే లాభం లేదని మారినట్లున్నాడు. ఇది అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిచ్చేదే.