Begin typing your search above and press return to search.
ఆ తర్వాత గుండెలపై చెయ్యేసుకున్నాం - మహేష్
By: Tupaki Desk | 6 Aug 2015 6:17 AM GMTశ్రీమంతుడు కౌంట్ డౌన్ మొదలైంది. వీకెండ్ థియేటర్లన్నీ హౌస్ ఫుల్. బాహుబలి తర్వాత అంత క్రెజీ ప్రాజెక్టుగా ఈ సినిమా థియేటర్ల లో సందడి చేయబోతోంది. మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 24గంటల్లో రిలీజ్ సందర్భంగా ప్రిన్స్ చెప్పిన సంగతులివి....
=శ్రీమంతుడు టైటిల్ గురించి తొలి షెడ్యూల్ పూర్తవ్వగానే కొరటాల చెప్పాడు. వెంటనే ఇది ఓకే అనుకున్నా. వాస్తవానికి మేం ఎప్పుడూ ఈ సినిమాకి ఓ మాస్ టైటిల్ పెట్టాలని అనుకోలేదు. కంటెంట్ ప్రకారం ఈ టైటిల్ సరిపోతుందని భావించాం. అందుకే దానినే ఫైనల్ చేసేశాం.
=ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టు కొత్తది. ఓ బిలియనీర్ ఓ ఊరిని దత్తత తీసుకుని ప్రజావసరాలన్నీ చూసుకోవడం అనేది లార్జర్ దేన్ లైఫ్ లాంటిది.
= పాత్ర చిత్రణ, పెర్ఫామెన్స్, డైలాగ్స్, నేరేషన్ ఇవన్నీ ఈ సినిమాకి 'యుఎస్ పి'. వీటిని నమ్మి చేసిన సినిమా ఇది. ఆన్ స్క్రీన్ మేనరిజమ్, స్క్రీన్ ప్లే, స్టయిల్స్ మాత్రమే కాదు. ఇందులో హృదయాల్ని టచ్ చేసే కథ ఉంది. అందుకే ఈ సినిమా చేయాలనుకున్నాం. తెరపై ప్రతిదీ సహజసిద్ధంగా కనిపించేలా ప్రయత్నించాం.
= సింపుల్ గా కనిపించే ఓ నల్ల చొక్కా తొడుక్కుని ఓ సైకిల్ తొక్కుకుంటూ హీరో వచ్చేస్తాడు. ఇదే మా ఫస్ట్ లుక్. ఇందులోనే మీనింగ్ అంతా ఉంది. శ్రీమంతుడు బిలియనీర్ అయినా సింపుల్ మ్యానరిజం, డౌన్ టు ఎర్త్ ఉండే కుర్రాడు అని చెప్పడమే దీని ఉద్ధేశ్యం. అందుకే అది అలా రివీల్ చేశాం. సాదా సీదాగా ఉన్నా స్టయిలిష్ గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఫస్ట్ లుక్ కి వచ్చిన స్పందన చూశాక గుండెలపై చెయ్యేసుకున్నాం.
=చారుశీల పాటలో శ్రుతిహాసన్ లుక్ హైలైట్. త్రీపీస్ డ్రెస్ లో అదరగొట్టేసింది. లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించిన పాట ఇది. ఇంతవరకూ నేను అత్యంత స్టయిలిష్ గా కనిపించింది చారుశీల పాటలోనే.
=తెరపై నటుడు నటన చేసి చూపించగలగాలని నమ్మేవాళ్లలో నేనొకడిని. నటన కనిపించి తారాల్సిందే. అలాగే నా గత రెండు సినిమాల నుంచి డ్యాన్సుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నా. అవి తెరపై బాగానే కనిపిస్తున్నాయి.
=నాన్న గారి నుంచి వారసత్వంగా మంచి మెమరీ వచ్చింది. నాకు తెలుగు చదవడం రాదు కాబట్టి .. డైలాగులన్నీ దర్శకుడు చెప్పినవి విని వెంటనే చెప్పేస్తుంటా. ఆన్ సెట్స్ స్పాంటేనియస్ గానే చెప్పేయగలగడం నాన్న గారి నుంచి అబ్బిన విద్య. సింగిల్ టేక్ లో ఓకే చేయడం ఆయన వల్ల వచ్చినదే.
=ఒకటికి రెండుసార్లు పెర్ఫెక్షన్ కోసం అడిగి మరీ రీటేక్ ల్లో నటించేవాడినని జగపతి చెప్పారు. ప్రతిసారీ అలా కాదు. సింగిల్ టేక్ లో ఫినిష్ చేయడమే ఇష్టం. కానీ జగపతిబాబుతో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో నటించాను. వాటి కోసమే రీటేక్ లు తీసుకోవాలనిపించింది.
=తమిళారంగేట్రం కాస్త ఆలస్యమే అయ్యింది. అయితే దానికి కారణాలున్నాయి. నా గత చిత్రాలు తమిళ్ లో రిలీజ్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. అక్కడికి వెళ్లాలంటే ఆ తరహా సినిమాలతోనే వెళ్లాలి.