Begin typing your search above and press return to search.
నాగార్జున తర్వాత మహేష్ బాబేనా..?
By: Tupaki Desk | 30 July 2022 12:30 PM GMTటాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు రెండు చేతులా సంపాదించడం అలవాటు చేసుకుంటున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు సినిమాలతో వచ్చిన మొత్తాన్ని సినీ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంటే ముందుగా కింగ్ అక్కినేని నాగార్జున గురించే చెప్పుకుంటుంటారు. అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ - సినిమాల నిర్మాణం చేస్తూనే మరెన్నో ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. ఈ విధంగా నాగ్ వ్యాపారవేత్తగానూ సక్సెస్ అయ్యారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కింగ్ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
నాగార్జున గతంలో తన ప్రెండ్ తో కలిసి 'N గ్రిల్' అనే హోటల్ ను ఏర్పాటు చేసి ఫుడ్ బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. మహేష్ బాబు కూడా ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని తెలుస్తోంది.
మహేష్ ఇప్పటికే 'ది హంబుల్' అనే డిజైనర్ వేర్ ద్వారా టెక్సటైల్ బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. అలానే ఏషియన్ గ్రూప్ తో కలిసి AMB సినిమాస్ పేరిట థియేటర్స్ మల్టీప్లెక్స్ రంగంలోకి ఎంటరయ్యాడు. అలానే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మూవీ ప్రొడక్షన్స్ లోకి కూడా వచ్చారు.
మహేష్ తాను నటించే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూనే.. ఇతర హీరోలతో చిత్రాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బంజారా హిల్స్ లో ఓ లగ్జరీ రెస్టారెంట్ ని స్టార్ట్ చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీని కోసం హైదరాబాద్ లోని ఫేమస్ రెస్టారెంట్ చెయిన్ ‘మినర్వా’ తో టైఅప్ అవుతున్నట్లు టాక్. మహేష్ బిజినెస్ వ్యవహారాలు చూసుకునే ఆయన సతీమణి నమ్రత.. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఐడియాని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
నిజానికి ఫుడ్ బిజినెస్ లోకి చాలా మంది స్టార్స్ వచ్చారు. కాకపోతే ఇప్పటి వరకు వచ్చిన వారంతా చిన్న మీడియం టైర్-2 హీరోలే. ఒక్క నాగార్జున మాత్రమే కెరీర్ లో పీక్ లో ఉన్నప్పుడే ఈ వ్యాపారంలోకి వచ్చిన అగ్ర హీరో. ఇప్పుడు నాగ్ బాటలో మహేష్ కూడా హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారని చెప్పాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. నిర్మాతగా 'మేజర్' చిత్రంతో బ్లాల్ బస్టర్ సాధించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీ కోసం సన్నద్ధం అవుతున్నాడు. దీని తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తో మహేష్ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు.