Begin typing your search above and press return to search.

'స్పై'డర్ కంటే బెటర్ ఆప్షన్

By:  Tupaki Desk   |   30 March 2017 4:15 PM IST
స్పైడర్ కంటే బెటర్ ఆప్షన్
X
ఆల్రెడీ తన సినిమా తాలూకు ఫస్ట్ లుక్ త్వరలోనే వస్తుందని.. అభిమానులు దయచేసి సహనం వహించాలని మహేష్‌ బాబు సూచించాడు. ఉగాది రోజున కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ రాలేదని డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కు మనోడు ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చేశాడు. అయితే అసలు మహేష్‌ బాబు ఒక లుక్ రిలీజ్ చేయడానికి ఇంతలా వెయిట్ చేయించాల్సిన అవసరం లేదు. మరి లేటవ్వడానికి కారణం ఏంటి?

నిజానికి ఈ సినిమా టైటిల్ ఏం పెట్టాలనేది తొలుత నుండి మహేష్‌ బాబును కాస్త ఇబ్బందిపెడుతూనే ఉంది. 'ఏజెంట్ శివ' అని కొన్ని రోజులూ.. 'అభిమన్యు' అని మరికొన్ని రోజులు డిస్కషన్లు జరిగాయ్. ఇక చివరకు 'స్పై'డర్ అంటూ.. మహేష్‌ పోషిస్తున్న 'స్పై' క్యారెక్టర్ ను.. ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించే ఒక రోబోట్ స్పయిడర్ (సాలె పురుగు) పేరును కలిపి పెట్టాడు మురుగుదాస్. ఈ సినిమా టీజర్ ఆల్రెడీ రెడీ అయిపోయినప్పటికీ.. ఇంతవరకు కేవలం టైటిల్ దగ్గర ఒక డెసిషన్ తీసుకోలేకపోవడంతో.. సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ రిలీజ్ కావట్లేదు.

ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టీమ్.. పైన పేర్కొన్న మూడు టైటిళ్లనూ డిజైన్ చేయించి.. వాటికి యానిమేషన్ చేయించి కూడా రెడీగా పెట్టేశాయట. మహేష్‌ ఏది ఓకె అంటే దానిని రిలీజ్ చేసేద్దాం అని. కాని ప్రస్తుత్నం వియత్నాంలో ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్సు చిత్రీకరణలో బిజీగా ఉన్న మహేష్‌.. తిరిగి ఇండియాకు వచ్చాకనే డెసిషన్ తీసుకుందాం అంటున్నట్లు టాక్. ఆ లెక్కన చూస్తే మనోడికి 'స్పై'డర్ కంటే బెటర్ ఆప్షన్ కావాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/