Begin typing your search above and press return to search.
కామెంట్: మహేష్ మనసుకు సెట్టవ్వుద్దా??
By: Tupaki Desk | 21 Oct 2015 7:30 PM GMTమల్టీప్లెక్సుల వ్యాపారంలోకి మహేష్ బాబు అడుగుపెడుతున్నాడనే న్యూస్.. వైరల్ లా వ్యాపించింది. త్వరలో హైద్రాబాద్ లో ప్రారంభం కానున్న ఓ మాల్ లో మల్టీప్లెక్సుల నిర్వహణ ప్రారంభించబోతున్నాడని, త్వరలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వెంచర్లు స్టార్ట్ చేయనున్నాడనే వార్త.. శ్రీమంతుడు సినిమా హిట్ టాక్ కంటే ఫాస్ట్ గా వ్యాపించిపోయింది.
తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఇలా మల్టీప్లెక్సుల వ్యాపారం నిర్వహించాలన్న ఆలోచన బాగానే ఉంది కానీ.. అసలిది లాభసాటి వ్యవహారమేనా అనే సంగతి ఆలోచించుకోవాలి. ప్రస్తుతం మల్టీప్లెక్సులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయినా సరే ఫిలిం ఎగ్జిబిషన్ వ్యవహారం రిస్కీ అనే చెప్పాలి. ఇప్పుడే ఈ రంగంలోకి అడుగుపెడుతున్న మహేష్.. పోటీ కంపెనీల వ్యాపార శైలిని ఓసారి పరిశీలిస్తే.. ఈ విషయం ఈజీగానే అర్ధమవుతుంది.
రిలయన్స్ గ్రూప్ కి యాడ్ లాబ్స్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ వెంచర్ ఉండేది. తర్వాత దీన్ని బిగ్ సినిమాస్ కు విక్రయించగా.. ఆ తర్వాత ఇప్పుడు ఇది కార్నివాల్ సినిమాస్ చేతికి వెళ్లిపోయింది. అంత గొప్పగా ఉంటుంది మల్టీప్లెక్స్ వ్యాపారం. నిజానికి సినిమా టికెట్లపై లాభాలు సంపాదించడం అన్నది అత్యాశే. వీకెండ్స్ లో తప్ప.. ఫుల్ ఆక్యుపెన్సీ లభించడం అన్నది కలలో మాటే. ఆ విషయం నిర్వాహకులకు కూడా బాగానే తెలుసు. అందుకే థియేటర్లలో అమ్మే ఫుడ్ బిజినెస్ పైనే ఎక్కువగా డిపెండ్ అవుతారు. ఏదైనా మల్టీప్లెక్స్ కి వెళ్లాలంటే మూవీ టికెట్ కి 150 ఇస్తే సరిపోతుంది. అదే ఇంటర్వెల్ లో పాప్ కార్న్ కొనుక్కోవాలంటే మాత్రం కనీసం 200 ప్లస్ వదిలించుకోవాలి. అదీ మల్టీప్లెక్సుల లెక్క. బయట 30 రూపాయలు కూడా చేయని పాప్ కార్న్ కే 200 పైగా వసూలు చేసే మల్టీప్లెక్సులు.. మిగిలిన ఫుడ్ ఆర్టికల్స్ కి ఎలా బాదేస్తాయో ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యాపారంలోకి ఎవరు అడుగు పెట్టినా పరిస్థితి ఇదే.
ఇప్పుడు మహేష్ బాబు స్టార్ట్ చేయబోతున్న మల్టీప్లెక్స్ బిజినెస్ కయినా.. టికెట్లతోపాటు పాప్ కార్న్ కి కూడా ప్రీమియం రేట్లు వసూలు చేస్తేనే గిట్టబాటవుతుంది. జనాలు దీనికి ఎలాగూ రెడీయే.. వాట్ అబౌట్ యూ మహేష్? ఇలాంటి బిబినెస్ మనోడి సున్నిత మనస్సుకు సెట్టవుద్దా?