Begin typing your search above and press return to search.

నమ్రతకు భరత్ సక్సెస్ కిస్

By:  Tupaki Desk   |   22 April 2018 10:07 AM IST
నమ్రతకు భరత్ సక్సెస్ కిస్
X
ప్రిన్స్ మహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు. భరత్ అనే నేనుకి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ముఖ్యంగా అభిమానుల సంతోషం మహేష్ కు ఊరట కలిగిస్తోంది. ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికే కొత్త రికార్డులు సృష్టించిన భరత్ అనే నేను విజయంలో వ్యక్తిగతంగా తనకు అండగా నిలబడిన భార్య నమ్రతా శిరోద్కర్ పాత్ర చాలా ఉందని ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పాడు. దానికి ఋజువు అని చూపించేందుకు కాబోలు నమ్రతా తన ఫేస్ బుక్ పేజీలో మహేష్ తనకు ఘాడంగా ఇచ్చిన లిప్ టు లిప్ కిస్ ఫోటోని ఫాన్స్ కోసం షేర్ చేసుకుంది. ఇలాంటి పిక్ నమ్రతా పోస్ట్ చేయటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎప్పుడు పిల్లల ఫోటోలతో ఉండే తన ఫేస్ బుక్ పేజీలో ఇలా పర్సనల్ గా ఉన్నది మాత్రం ఇదే మొదటిది.

తమ మధ్య ఎంత ప్రేమ ఉందో సింబాలిక్ గా మరోసారి చూపించే ప్రయత్నం చేసిన నమ్రతా ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నట్టే ఉంది. మొదటిసారి మహేష్ తో నమ్రతా నటించిన వంశీ సినిమా షూటింగ్ టైంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఆ మూవీ సక్సెస్ కానప్పటికీ వీళ్ళ లవ్ సూపర్ హిట్ అయిపోయి పెళ్లి పీటలు ఎక్కేసింది. అదే సినిమాలో మహేష్ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఇద్దరి పిల్లల బాధ్యతలతో పాటు మహేష్ సినిమా వ్యవహారాలు కూడా కనిపెట్టుకుని ఉండే నమ్రతా ఆ మధ్య మహేష్ బాబు టీం పేరుతో అభిమానులను కలుసుకుని ఫోటోలు తీసుకునే ప్రోగ్రాం ఒకటి డిజైన్ చేసి అందరి మెప్పు పొందారు. సుమారుగా రెండు వేలకు పైగా ఫాన్స్ వ్యక్తిగతంగా మహేష్ తో ఫోటోలు దిగారు. భరత్ ప్రమోషన్ విషయంలోనూ నమ్రతా చాలా యాక్టివ్ గా వర్క్ చేసినట్టు షూటింగ్ టైంలోనే వార్తలు వచ్చాయి. అందుకే కాబోలు మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. నమ్రతా మరో ఉదాహరణగా నిలిచారుగా