Begin typing your search above and press return to search.

ట్వీటుతో మహేష్‌ ఎవరికి షాకిచ్చాడు?

By:  Tupaki Desk   |   1 Jan 2017 11:23 AM GMT
ట్వీటుతో మహేష్‌ ఎవరికి షాకిచ్చాడు?
X
క్లుప్తంగా చెప్పాలంటే.. బ్రహ్మోత్సవం లాస్ కవర్ చేయడానికి మహేష్‌ బాబు.. ఊపిరి లాస్ కవర్ చేయడానికి వంశీ పైడిపల్లి.. నిర్మాత పివిపి కోసం మరో సినిమా చేస్తాం అన్నారు. ఇద్దరూ కూడా కలసి ఒకటే సినిమా చేసేందుకు సిద్దపడ్డారు. ఈ టైములో మహేష్‌ బాబుతో తాను చేసే సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడని వంశీ చెప్పడంతో.. పివిపి కంప్లయింట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మహేష్‌ బాబు ఏమీ చిన్న హీరో కాదుగా.. వంశీ పైడిపల్లి సింపుల్ గా మనోడ్ని పివిపి గూటిలో నుండి తీసి రాజు గారి క్యాంపులో పెట్టడానికి. అందుకే అందరూ సూపర్ స్టార్ ఈ యవ్వారంలో ఏమని స్పందిస్తాడో అంటూ ఆతృతగా ఎదురుచూశారు.

ఇప్పుడు మహేష్‌ బాబు కూడా ఒక షాకింగ్ ట్వీటుతో ఎప్పుడూ చేయనంటి ఒక ఫీట్ చేశాడు. తన 23వ సినిమాను ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో చేస్తున్న మహేష్‌.. తదుపరి సినిమాల గురించి ఒక ట్వీటేశాడు. ''24వ సినిమాను శివ కొరటాల డైరక్షన్లో డివివి దానయ్య ప్రొడక్షన్లో చేస్తున్నాను. 25వ సినిమాను వంశీ పైడిపల్లి డైరక్షన్లో దిల్ రాజు అండ్ అశ్వినీ దత్ లతో చేస్తున్నాను. 26వ సినిమాను త్రివిక్రమ్ డైరక్షన్లో మైత్రి వారికి చేస్తున్నాను'' అంటూ మహేష్‌ సెలవిచ్చాడు. మరి వంశీతో చేసే సినిమాను దిల్ రాజు అండ్ అశ్వీని దత్ లతోనే అంటూ కన్ఫామ్ చేయడంతో.. పివిపి కి డైరెక్టుగా ఒక పెద్ద ''నో'' చెప్పేసినట్లేగా? పైగా మహేష్‌ ఈ లెవెల్లో క్లారిటీ ఇచ్చాక కూడా పివిపి ఇంకా లీగల్ రూటులో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడా?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/