Begin typing your search above and press return to search.

'మ‌హ‌ర్షి' మ‌ల్టీప్లెక్సుల్లోనే కాదు అక్క‌డా బాదుడే!

By:  Tupaki Desk   |   7 May 2019 4:36 PM GMT
మ‌హ‌ర్షి మ‌ల్టీప్లెక్సుల్లోనే కాదు అక్క‌డా బాదుడే!
X
సినిమా హైప్ ని క్యాష్ చేసుకుని ఆరంభ వ‌సూళ్ల‌ను దండుకోవ‌డం అన్న‌ది చాలా కాలంగా చూస్తున్న‌దే. అందుకు టిక్కెట్టు బాదుడు డైరెక్ట్ మార్గం. ఈ దారిలో `మ‌హ‌ర్షి` దొరికిందంతా దోచేస్తున్నాడా? అంటే అవున‌నే తాజా స‌మాచారం. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన `మ‌హ‌ర్షి` మే9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల మేర థియేట్రిక‌ల్ రిలీజ్ హ‌క్కుల్ని విక్ర‌యించార‌ని ఆ మేర‌కు షేర్ వ‌సూలు చేయాల్సి ఉంద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే తొలి వారం టిక్కెట్టు ధ‌ర‌ల్ని పెంచి వ‌సూళ్ల రికార్డుల్ని ప్లాన్ చేశార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

అయితే అది ఎంత‌వ‌ర‌కూ నిజం? అన్న‌ది ప‌రిశీలిస్తే .. వైజాగ్.. విజ‌య‌వాడ లాంటి న‌గ‌రాల్లో బుక్ మై షో ప‌రిశీలిస్తే సింగిల్ థియేట‌ర్ల‌లో రేట్లు టాప్ క్లాస్ రూ.200.. వ‌ర‌కూ పెంచి అమ్మేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ బాదుడు మ‌ల్టీప్లెక్స్ వ‌ర‌కే అనుకుంటే పొర‌పాటే. సింగిల్ థియేట‌ర్ల‌లోనూ ఇదే రేట్లు ప‌ల‌క‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రాజ‌మండ్రి లాంటి టూటైర్ సిటీలోనూ టిక్కెట్టు రూ.200 ప‌లుకుతోంది అంటే అర్థం చేసుకోవ‌చ్చు. విశాఖ ప‌ట్నం.. కాకినాడ‌..ఏలూరు.. రాజ‌మండ్రి..విజ‌య‌వాడ‌.. నెల్లూరు.. తిరుప‌తి త‌దిత‌ర చోట్ల టిక్కెట్టు ధ‌ర‌లు రూ.200 మార్క్ ని ట‌చ్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. విజ‌య‌వాడ ... ఏలూరు.. హైద‌రాబాద్ లాంటి చోట్ల రూ.200 -250 రేంజు ప‌ల‌క‌డం జ‌నాల్లో డిబేట్ కి కార‌ణ‌మైంది. వైజాగ్ ముక్తా సినిమాస్ లో టిక్కెట్టు ధ‌ర 200 ప‌లుకుతోంది. అయితే కొన్ని చోట్ల మారుమూల సింగిల్ థియేట‌ర్ల‌లో మాత్రం రూ.150 ధ‌ర కూడా అందుబాటులో క‌నిపిస్తోంది. ఏపీలో టిక్కెట్ల అమ్మ‌కాల స‌ర‌ళి ప‌రిశీలిస్తే ఒక్కో న‌గ‌రంలో ఒక్కోలా ఉంది. టాప్ రేంజ్ సిటీస్ లో బుక్ మై షో లాంటి చోట్ల‌నే అధికారికంగా టిక్కెట్టు రేటు పెంచి అమ్మేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తాజాగా నైజాంలో టిక్కెట్టు ధ‌ర‌లు పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింద‌ని.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ. 110కి..మల్టీఫ్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.50 అద‌నంగా పెంచేశార‌ని వార్త‌లొచ్చాయి. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 రూపాయలున్న ఒక్కో టికెట్ ధరను రూ.200 చేశారని ప్ర‌చార‌మైంది. అయితే ఇదేదీ నిజం కాద‌ని తాజాగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ అధికారికంగా ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. అంటే టిక్కెట్టు రేటు పెంచుకునేందుకు అనుమ‌తి లేక‌పోయినా ఎవ‌రిష్టానికి వాళ్లు పెంచుకుని అమ్మేస్తున్నారా? అన్న సందేహం క‌లుగుతోంది.

వైజాగ్- ఉత్త‌రాంధ్ర లో చాలా చోట్ల‌ థియేట‌ర్ య‌జ‌మానులు మాత్రం దిల్ రాజు ప్ర‌పోజ‌ల్ కి అంగీక‌రించ‌డం లేద‌న్న ప్ర‌చారం సాగింది. బుక్ మై షోలో ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ థియేట‌ర్లు బ్లాక్డ్ అని చూపిస్తోంది. వైజాగ్ జ‌గ‌దాంబ‌లో రూ.150.. రూ.112.. రూ.110.. రూ.70 నాలుగు క్లాస్ ల టిక్కెట్లు బుక్ మై షో చూపిస్తోంది. అయితే చాలా చోట్ల మాస్ థియేట‌ర్లలో ఏవో అర‌కొర టిక్కెట్లు మాత్ర‌మే అధికారికంగా విక్ర‌యించి.. మిగ‌తావి థియేట‌ర్ య‌జ‌మానులే బ్లాక్ లో అమ్మిస్తార‌న్న సంగ‌తి అనుభ‌వ పూర్వ‌కంగా తెలిసిన‌దే. హైద‌రాబాద్ లో మ‌ల్టీప్లెక్స్ లో టిక్కెట్టు ధ‌ర రూ.150గా ఉంది. ఏఎంబీలో ఎగ్జిక్యూటివ్ చైర్ వ‌ర‌కూ రూ.200 వ‌ర‌కూ ఉంది. అయితే మ‌హేష్ కి ఉన్న క్రేజు దృష్ట్యా మ‌హ‌ర్షి తొలి వీకెండ్ టిక్కెట్లు ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఆన్ లైన్ టికెటింగ్ పోర్ట‌ల్స్ లో ఇప్ప‌టికే నోరూమ్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ముఖ్యంగా మ‌ల్టీప్లెక్సుల టిక్కెట్లు అస‌లే దొర‌క‌డంలేదు. అయితే నైజాంలో అధికారికంగా అమ్ముకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించినా ఏపీలో అనుమ‌తులు లేవ‌ని అన్నారు. ఇక్క‌డ ఒక్కోచోట ఒక్కోలా టిక్కెట్టు ధ‌ర‌లు ఉన్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్లు.. స‌బ్ క‌లెక్ట‌ర్లు స‌హా అధికారులు దీనికి ప‌ట్టించుకున్నారో లేదో అంటూ సినీఅభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. బుక్ మై షో స‌హా ఆన్ లైన్ పోర్ట‌ల్స్ లో ఇలా పెంచిన ధ‌ర‌ల‌తోనే అమ్మేయ‌డానికి అధికారుల నుంచి అనుమ‌తి ఉందా? అన్న‌ది తెలియాల్సి ఉంది.