Begin typing your search above and press return to search.
ఆకాశాన్ని తాకుతున్న మహర్షి హిందీ రైట్స్
By: Tupaki Desk | 22 Sep 2018 1:14 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ 25 వ చిత్రం 'మహర్షి' లో నటిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో 'మహర్షి' హిందీ డబ్బింగ్ రైట్స్ కు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందట. డిమాండ్ కు తగ్గట్టే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హిందీ రైట్స్ కు రూ. 25 కోట్లు కోట్ చేస్తున్నాడని సమాచారం.
తెలుగు స్టార్ హీరోల సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కు ఈమధ్య డిమాండ్ ఊహించనంతగా పెరిగింది. రీసెంట్ గా చరణ్ - బోయపాటి తాజా చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ రూ. 22 కోట్ల కు క్లోజ్ అయిందట. చరణ్ స్టార్ హీరో కావడం.. పైగా బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా 'సరైనోడు' హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో వ్యూస్ .. టీవీ చానల్స్ లో టీఆర్పీ మోత మోగించడంతో భారీ ధరకు అమ్ముడుపోయిందట. దీంతో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లకు డిమాండ్ గమనించిన దిల్ రాజు 'మహర్షి' సినిమాకు పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట.
మహేష్ బాబు హిందీ ఆడియన్స్ లో బాగా ఫెమిలియర్ హీరో. పైగా అక్కడి నిర్మాతల్లో కూడా ఈ సినిమా రైట్స్ కోసం పోటీ నెలకొనడంతో హిందీ రైట్స్ డీల్ త్వరలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. 'మహర్షి' వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.