Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ బిజినెస్ ఇంకా డైలమా!
By: Tupaki Desk | 30 March 2019 4:37 AM GMTసూపర్ స్టార్ మహేష్ స్టామినా గురించి .. ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. `భరత్ అనే నేను` చిత్రంతో 200కోట్ల క్లబ్ హీరోగా పాపులరయ్యారు. 100కోట్ల షేర్ తేగల సత్తా ఉన్న స్టార్ గా నిరూపించారు. అందుకే అతడు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి పై భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రేంజు ఎంత? అంటే ఇప్పటివరకూ సరైన సమాచారం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓకే కానీ - ఓవర్సీస్ మాటేమిటి? అన్న చర్చా సాగుతోంది.
అమెరికా సహా ఓవర్సీస్ హక్కులకు 18-20 కోట్ల మేర నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. అయితే అది చాలా పెద్ద మొత్తం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయని - ఇంకా డీల్ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇదివరకూ 12కోట్ల ఆఫర్ వస్తే నిర్మాతలు వెనక్కి తగ్గారట. ఇప్పటికీ 18 కోట్ల మేర డిమాండ్ చేస్తున్నారట. మహర్షి సక్సెస్ పై దిల్ రాజు - వంశీ పైడిపల్లి సహా చిత్ర బృందం పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. ఆ క్రమంలోనే రేటు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదట. పట్టు విడుపు లేకపోవడంతో ఓవర్సీస్ వరకూ కొనేవారే లేరని ప్రచారమవుతోంది.
మహేష్ నటించిన `భరత్ అనే నేను` ఇంటా బయటా (ఓవర్సీస్) బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెసైంది. అయితే ఓవర్సీస్ హక్కుల కోసం భారీ మొత్తాల్ని వెచ్చించి కొనడంతో పంపిణీదారులకు గిట్టు బాటు కాలేదట. `రంగస్థలం` కి వచ్చినట్టు లాభాలు రాలేదు. అందుకే ఓవర్సీస్ ట్రేడ్ లో డైలమా కొనసాగుతోందని సమాచారం. మహేష్ ఈ చిత్రంలో కాలేజ్ విద్యార్థిగా - రైతుగా - ఎన్నారైగా రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఆడియెన్ కి కనెక్టయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన `చోటి చోటి బాతే..` సాంగ్ కి అభిమానుల్లో చక్కని స్పందన వచ్చింది. డీఎస్‌పీ మార్క్ బాణీ ఆకట్టుకుంది. ఇప్పటికే 25లక్షల (2.5 మిలియన్) వ్యూస్ ని ఈ పాట దక్కించుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్- నరేష్- పూజా క్లాస్ మేట్స్ అని తాజాగా రివీల్ చేసిన పోస్టర్ చెబుతోంది. దిల్ రాజు- అశ్వని దత్- పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.