Begin typing your search above and press return to search.
'మహర్షి' బిజినెస్ ఇదీ లోగుట్టు?
By: Tupaki Desk | 2 April 2019 4:18 AM GMTభారీ కాస్టింగ్ .. భారీ సెట్టింగులు.. భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడం వంశీ పైడిపల్లి శైలి. ప్రతి ఫ్రేమ్ ని వర్ణరంజితంగా రంగులమయం చేయాలని తపించే అతడు పక్కా పెర్ఫెక్షనిస్టు అని చెబుతుంటారు. అందుకోసం నిర్మాతలు రాజీ పడకుండా బడ్జెట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అది కాస్ట్ ఫెయిల్యూర్ కి దారి తీయొచ్చు. పైడిపల్లి గత చిత్రం `ఊపిరి` విషయంలో అలానే జరిగిందని చెబుతుంటారు. ఊపిరి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కాస్ట్ ఫెయిల్యూర్ ఇబ్బంది పెట్టిందని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం మహేష్ తో వంశీ పైడిపల్లి చేస్తున్న మహర్షి సన్నివేశమేంటి? ఈ సినిమా బడ్జెట్ ఎంత పెట్టారు? బిజినెస్ ఎంత పూర్తయింది? ఏ ఏరియాలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు? అంటూ ఆసక్తికర చర్చ ట్రేడ్ లో సాగుతోంది. అయితే ఇదీ అని కన్ఫామ్ గా చెప్పలేని సన్నివేశం ఇప్పటికైతే నెలకొంది.
ట్రేడ్ ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం... ఈ సినిమా 90 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ రూపంలో బిజినెస్ చేయనుంది. 40 కోట్లు నాన్ థియేట్రికల్ (శాటిలైట్ - డిజిటల్- డబ్బింగ్ రైట్స్- ఆడియో రైట్స్ వగైరా) రైట్స్ రూపంలో దక్కనుందని అంచనా వేస్తున్నారు. ఏపీ వరకూ 40కోట్ల లోపు బిజినెస్ పూర్తి కానుందట. ఎలానూ నైజాం- దిల్ రాజు సొంతం గా రిలీజ్ చేస్తారు. దీనికి 18 కోట్ల రేంజ్ బిజినెస్ సాగనుందని ఓ అంచనా. సీడెడ్ -15 కోట్ల రేంజ్ బిజినెస్ సాగించే వీలుందని తెలుస్తోంది. ఓవర్సీస్ 12కోట్ల వరకూ ఓకే. అయితే నిర్మాతల డిమాండ్ 18కోట్ల వరకూ ఉండడంతో ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదని చెబుతున్నారు.
150 రోజుల షూటింగ్ .. భారీ సెటప్ లు.. సెట్టింగులు... 100కోట్లు పైగా బడ్జెట్ ఖర్చు అయ్యిందని ఓ విశ్లేషణ చేస్తున్నారు. అయితే `మహర్షి` చిత్రానికి రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి? అన్నది విశ్లేషిస్తే.. మహేష్ గత చిత్రాల్ని పరిశీలిస్తే `భరత్ అనే నేను` ఏపీలో 36కోట్లు వసూలు చేసిందని టాక్ ఉంది. అంటే మహర్షి 40కోట్ల బిజినెస్ చేస్తే ఆ మేరకు రిలీజ్ డే బంపర్ హిట్ అన్న టాక్ రావాలి. ఇక సీడెడ్ లో `భరత్ అనే నేను` చిత్రాన్ని 13కోట్లకు అమ్మారు.. రిటర్న్స్ మాత్రం 10కోట్లే వచ్చిందని అప్పట్లో ట్రేడ్ చెప్పింది. ఇప్పుడు మహర్షి 15కోట్ల బిజినెస్ చేస్తే ఆ మేరకు వసూళ్లు పెరగాల్సి ఉంది. ఓవర్సీస్ లోనూ ఫ్యామిలీ ఆడియెన్ కి కనెక్టయ్యి అన్నీ కుదిరితే భారీ వసూళ్లు దక్కే వీలుంటుంది. మినిమంగా 100 కోట్లు పైగా షేర్ వసూలైతేనే పంపిణీదారులకు రిలీఫ్ గా ఉంటుందన్న విశ్లేషణ సాగుతోంది. మరి అధికారికంగా బిజినెస్ వివరాల్ని దిల్ రాజు రివీల్ చేస్తారేమో చూడాలి.