Begin typing your search above and press return to search.
హమ్మయ్య మహర్షి టచ్ చేశాడు
By: Tupaki Desk | 12 May 2019 4:42 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రైతుల బ్యాక్ డ్రాప్ లో మెసేజ్ ని మిక్స్ చేస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందించిన మహర్షి వీకెండ్ రన్ బాగా సాగుతోంది. నాలుగు రోజులు వచ్చాయి కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడంలో ప్రిన్స్ బిజీగా ఉన్నాడు. అనూహ్యంగా ఓవర్సీస్ లో కాస్త స్లోగా ఉన్న మహర్షికి మిలియన్ మార్క్ చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది.
సాధారణంగా మహేష్ రేంజ్ హీరో మూవీకి హిట్ టాక్ వస్తే ఇంత టైం పట్టదు. ప్రీమియర్లతో కలిపి ఫస్ట్ డేనే ఈ ఫీట్ సాధించవచ్చు. అయితే మహర్షికి యునానిమస్ గా ఒకే టాక్ రాకపోవడం ప్రభావం చూపించింది. ఆల్ టైం రికార్డ్స్ కొట్టే విషయంలో కూడా అందుకే అనుమానాలు ఉన్నాయి. ఇంకాస్త స్పీడ్ పెంచి ఇకపై కూడా ఇదే రన్ ని కొనసాగించాలి. అప్పుడుకాని బయ్యర్లు సేఫ్ జోన్ లోకి ప్రవేశించే అవకాశం ఉండదు
మొన్న శుక్రవారానికి $924K అందుకున్న మహర్షి నిన్న చివరి షో పూర్తి కాకముందే 1 మిలియన్ మార్క్ అందుకుంది. మహేష్ ఫాన్స్ టెన్షన్ తీరింది. అయితే ఇది సరిపోదు. కనీసం రెండు లేదా రెండున్నర మిలియన్ మార్కు సాధిస్తేనే మహర్షిని కమర్షియల్ హిట్ కింద జమ కట్టవచ్చు. మెల్లగా స్లో అవుతున్న గ్రాఫ్ ను చూస్తుంటే అదంతా ఈజీ కాదనే వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తోంది.
మహేష్ సినిమాలకు మాములుగా ఇలాంటి పరిస్థితి ఉండదు. గీత గోవిందం లాంటి మీడియం రేంజ్ సినిమానే ఈ ఫీట్ సాధించగా లేనిది మహేష్ ఉన్న మహర్షి లాంటి సినిమాకు వసూళ్లు ఆ స్థాయిలో లేకపోతే కష్టం. రేపటి నుంచి ప్రారంభమయ్యే కొత్త వీక్ మహర్షికి సవాలుగా మారనుంది. స్టడీగా ఉంటే సరే సరి. లేదా అంతే సంగతులు