Begin typing your search above and press return to search.
ఎలక్షన్.. పరీక్షలు అయ్యాకే మహర్షి!
By: Tupaki Desk | 6 March 2019 10:42 AM GMTసూపర్ స్టార్ మహేష్ నటించిన `భరత్ అనే నేను` బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వ ంలో కెరీర్ 25వ సినిమాలో నటిస్తున్నారు. పీవీపీ- అశ్వనిదత్ - దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత దిల్ రాజు నుంచి వస్తున్న భారీ చిత్రంగానూ మహర్షి పేరు మార్మోగిపోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తొలుత ఏప్రిల్ 5న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఆ తర్వాత 20 రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు అది కూడా కుదరలేదు. నిర్మాణానంతర పనులు ఆలస్యం వల్ల మరింత ఆలస్యమవుతోందని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. మహర్షి చిత్రం ఎలక్షన్.. పరీక్షలు పూర్తయ్యాక మే 9న రిలీజవుతుందని నేడు హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మీడియాకి ప్రకటించారు.
దిల్ రాజు మాట్లాడుతూ- ``మహర్షి చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. మార్చి 17 నాటికి మొత్తం టాకీ పూర్తవుతుంది. రెండు పాటలు - మాంటేజెస్ బ్యాలెన్స్ ఉంటాయి. మాంటజెస్ ని అబూదబీలో తెరకెక్కిస్తాం. రెండు పాటల్ని సెట్స్ లో పూర్తి చేస్తాం. ఏప్రిల్ 12 నాటికి పూర్తి చేస్తాం. తొలుత ఏప్రిల్ 5 అనుకున్నాం. ఉగాది కానుకగా రిలీజ్ అనుకుంటే.. అమెరికా షెడ్యూల్ వీసాల సమస్య వల్ల నెలరోజులు ఆలస్యమైంది. దాని వల్ల అదేనెల 25కి వాయిదా వేసాం. ఫైనల్ గా ఇప్పుడు మే 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం`` అని తెలిపారు.
సినిమా సంగతులు ముచ్చటిస్తూ..ఈ సినిమాని వంశీ పైడిపల్లి తన కెరీర్ బెస్ట్ గా తీస్తున్నారు. అతడు నాతో మూడు సినిమాలు - పీవీపీతో ఒక సినిమా (ఊపిరి) చేశాడు. మహర్షి తన కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది. స్క్రిప్టు అద్భుతంగా రావడంతో సినిమా బాగా వచ్చింది. నిర్మాతలు సహా టెక్నీషియన్లు అంతా ఎగ్జయిట్ మెంట్ లో ఉన్నాం. అందుకే నిర్మాణానంతర పనులు హర్రీగా చేయాలనుకోలేదు. సినిమా బాగా వచ్చింది. ఇంకా బాగా చేయాలని అనుకున్నాం. హీరో సహా అందరితో కలిసి చర్చించాం .. మే 9న రిలీజ్ చేయాలని అనుకున్నాం. క్వాలిటీలో రాజీకి రాకుండా అన్ని విలువలతో తీసిన సినిమా ఇది. అందుకే ప్రాపర్ గా రిలీజ్ చేస్తున్నాం. అశ్వనిదత్ `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `మహానటి` వంటి చిత్రాలు మేలో వచ్చాయి. మా బ్యానర్ లో ఆర్య మేలోనే రిలీజ్ చేసాం. సెంటిమెంటుగానూ కలిసొస్తుందని నమ్ముతున్నాం.. అని తెలిపారు. ఇక ఈ చిత్రం మహేష్ కెరీర్ బెస్ట్ ఫిలిం అవుతుంది మహర్షి. మా బ్యానర్ లో సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది. పీవీపీ మా అందరి కలయికలో వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ ఇది. పార్టమెంట్ ఎలక్షన్స్ ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో ఉన్నాయి. ఎలక్షన్ అయ్యాక .. పరీక్షలు పూర్తయ్యాక స్టూడెంట్స్ ఫ్యామిలీ రెడీగా ఉండగా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.