Begin typing your search above and press return to search.
రంగస్థలం రూట్ లోనే మహర్షి ?
By: Tupaki Desk | 9 March 2019 2:30 PM GMTఒక్కప్పటి ప్రేక్షకులకున్న ఓపిక ఇప్పటి జెనరేషన్ కు లేదు. రెండు గంటలు సినిమా చూశామా ఇంటర్వెల్ లో పాప్ కార్న్ లేదా స్నాక్స్ తిన్నామా పార్కింగ్ లో బైకో కారో తీసుకుని ఇంటికి వచ్చేశామా అనే రీతిలో అన్ని ఫాస్ట్ గా జరిగిపోవాలని చూస్తున్నారు. సినిమా లెన్త్ తో పాటు థియేటర్ కు చేరుకోవడానికి తిరిగి ఇంటికి వచ్చే సమయం ఇవన్నీ లెక్కేసుకుని రావాల్సి ఉంటుంది. కాబట్టి చెప్పాల్సిన విషయమేదో సూటిగా చెప్పండి టికెట్ డబ్బులు ఇచ్చేసి చూసి వెళ్ళిపోతాం అంటున్నారు ఆడియన్స్.
దానికి తగ్గట్టే దాదాపు దర్శకులందరూ తమ సినిమాలను సాధ్యమైనంత మేరకు రెండున్నర గంటల లోపే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఏడాది రంగస్థలం మహానటిలు వీటికి మినహాయింపుగా నిలిచి కొన్ని నిమిషాల తేడాతో మూడు గంటల సేపు కూర్చోబెట్టి అలరించాయి. ముఖ్యంగా రంగస్థలం మూడు గంటల నిడివిని లెక్కచేయకుండా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో ఇండస్ట్రీ రికార్డులు సొంతమయ్యాయి. దాని తర్వాత భరత్ అనే నేను ఇదే ఫార్ములా అప్లై చేశారు. ఇంత కాదు కానీ రెండు ముప్పాతిక గంటల దాకా వచ్చిన కొరటాల శివ పొలిటికల్ ప్యాకేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది.
ఇప్పుడు మహర్షి వంతు వచ్చింది. ఇది కూడా వీటి తరహాలోనే మూడు గంటల ఇరవై నిమిషాల దాకా ఎడిటెడ్ వెర్షన్ వచ్చిందట. అక్కడికి నాలుగు గంటలు ఉన్నదాన్ని కట్ చేసుకుంటూ వస్తేనే అంత తేలిందట. సో ఇప్పుడు వంశీ పైడిపల్లి ముందున్న తక్షణ కర్తవ్యం దీన్ని మూడు గంటలలోపే కుదించడం. కంటెంట్ ఉందంటున్నారు కాబట్టి రంగస్థలం తరహాలో జనం మెచ్చవచ్చు. ఇప్పుడు ఆ కోత వేయడమే పెద్ద ఛాలెంజ్ గా మారిందని ఇన్ సైడ్ టాక్. ఇంకా చేతిలో కావలసినంత టైం ఉంది కాబట్టి తాపీగా చేసుకోవచ్చు.