Begin typing your search above and press return to search.
అమెరికాలో మహర్షి టార్గెట్ ఎంతంటే?
By: Tupaki Desk | 8 May 2019 4:31 PM GMTసూపర్ స్టార్ మహేష్ కి అమెరికా- ఓవర్సీస్ మార్కెట్ ని ఓపెన్ చేసిన తొలి సినిమా `అతడు`. మహేష్ డైనమిజానికి... చక్కని స్క్రీన్ ప్లే.. త్రివిక్రమ్ మాటల మ్యాజిక్ తోడవ్వడం.. దానికి మ్యూజిక్ సరిగ్గా సెట్టవ్వడంతో `అతడు` అమెరికాలో బంపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`.. `దూకుడు` సినిమాలు ఓవర్సీస్ లో చక్కని వసూళ్లు సాధించాయి. కొరటాల తెరకెక్కించిన శ్రీమంతుడు.. భరత్ అనే నేను చిత్రాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను సాధించాయి. అయితే తాజాగా రిలీజవుతున్న `మహర్షి` అమెరికా-ఓవర్సీస్ నుంచి ఎంత వసూలు చేస్తే మహేష్ కెరీర్ బెస్ట్ అవుతుంది? అన్నది పరిశీలిస్తే ఇంట్రెస్టింగ్ సంగతులే తెలిశాయి.
అమెరికాలో టాప్ 5 సినిమాల జాబితా తిరగేస్తే నాన్ బాహుబలి కేటగిరీలో `రంగస్థలం` చిత్రం 3,514కె మిలియన్ డాలర్లు వసూలు చేసి నంబర్ -1 స్థానంలో నిలిచింది. ఓవర్సీస్ లో టాప్-1 రికార్డ్ ప్రస్తుతానికి చెర్రీ పేరుతో సుస్థిరమై ఉంది. ఆ తర్వాత మహేష్ నటించిన `భరత్ అనే నేను` 3,419 కె డాలర్లతో రెండో స్థానంలో .. 2,876కె డాలర్లతో `శ్రీమంతుడు మూడో స్థానంలో నిలిచాయి. మహానటి -2,595 కె డాలర్లు.. గీత గోవిందం- 2,464 కె డాలర్లతో టాప్ 5లో నిలిచాయి. మహేష్ నటించిన మహర్షి వీటన్నిటినీ అధిగమించి 3,514కె డాలర్లు పైగా వసూలు చేస్తేనే టాప్ పొజిషన్ కి చేరుకున్నట్టు. అయితే అదేమీ అంత ఆషామాషీ ఫీట్ కాదు. మహర్షి చిత్రానికి బంపర్ హిట్ టాక్ వస్తేనే ఇది సాధ్యం. `భరత్ అనే నేను` చిత్రంతో పోలిస్తే మహర్షి చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ తక్కువ ధరకే వెళ్లింది కాబట్టి బయ్యర్లకు అది కొంతమేరకు ఊరట. సినిమా బ్లాక్ బస్టర్ అన్న టాక్ తొలిరోజే వినిపిస్తే సేఫ్ అయ్యే ఛాన్సుంటుంది.
ఇక మహేష్ కెరీర్ లోనే కాకుండా నాన్ బాహుబలి కేటగిరీలో అత్యధిక స్క్రీన్లలో `మహర్షి` రిలీజవుతోంది. అమెరికాలో ఏకంగా 2500 పైగా ప్రీమియర్ షోలను వేయడం అన్నది ఓ హిస్టరీ. అందుకే ఈ సినిమా ఓవర్సీస్ లో ఓపెనింగుల రికార్డుల్ని నమోదు చేస్తుందని చిత్రయూనిట్ ధీమాగా చెబుతోంది. అమెరికాలో మహర్షి 250 పైగా లొకేషన్లలో రిలీజవుతోంది. అలాగే బ్రిటన్ లో 32 లొకేషన్లను ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా.. న్యూజిల్యాండ్.. మలేషియా.. సింగపూర్.. కెనడా .. యూరప్ లో ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. గల్ఫ్ లో ఏకంగా 76 లొకేషన్లలో ఈ చిత్రం రిలీజవుతోందని సమాచారం.